ఉప ముఖ్యమంత్రిగా పవన్‌ కల్యాణ్ బాధ్యతలు – పలు దస్త్రాలపై సంతకాలు

Spread the love

 విజయవాడ

ఉప ముఖ్యమంత్రిగా పవన్‌ కల్యాణ్ బాధ్యతలు – పలు దస్త్రాలపై సంతకాలు

ఉప ముఖ్యమంత్రిగా జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ విజయవాడ క్యాంపు కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు.

అలాగే పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, ఆర్‌డబ్ల్యూఎస్‌, పర్యావరణ, శాస్త్రసాంకేతిక, అటవీ శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టారు

పలు దస్త్రాలపై ఆయన సంతకాలు చేశారు

ఉప ముఖ్యమంత్రిగా జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ విజయవాడ క్యాంపు కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఛాంబర్‌లో పూజలు నిర్వహించిన అనంతరం దస్త్రాలపై సంతకాలు చేశారు. అలాగే పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, ఆర్‌డబ్ల్యూఎస్‌, పర్యావరణ, శాస్త్రసాంకేతిక, అటవీ శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టారు. ఉపాధి హామీ పథకానికి ఉద్యానవన పనులను అనుసంధానించే నిధుల మంజూరు దస్త్రంపై, గిరిజన గ్రామాల్లో పంచాయతీ భవనాల నిర్మాణ దస్త్రంపై సంతకాలు చేశారు. అలాగే పలు దస్త్రాలపై ఆయన సంతకాలు చేశారు. అనంతరం సోదరుడు నాగబాబు, వివిధ శాఖల అధికారులు, ఎమ్మెల్యేలు, నేతలు పవన్‌కు అభినందనలు తెలిపారు.

డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన పవన్‌ కల్యాణ్‌కు మంత్రులు, జనసేన నేతలు అభినందనలు తెలిపారు. ఆయన్ను కలిసిన వారిలో మంత్రులు నాదెండ్ల మనోహర్‌, కందుల దుర్గేశ్‌, ఎంపీ తంగెళ్ల ఉదయ్‌ శ్రీనివాస్‌, ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్‌ యాదవ్‌, టీడీపీ నేత, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తదితరులు ఉన్నారు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *