‘ఉపాధి’లో ఏపీ రాష్ట్ర మహిళల రికార్డు
ఏపీలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని (నరేగా) వినియోగించుకోవడంలో పురుషుల కంటే మహిళలే ముందుంటున్నారు. జాతీయ స్థాయి సగటు కంటే అత్యధికంగా పనిదినాలు ఉపయోగించుకోవడంలో రాష్ట్ర మహిళలు రికార్డు సృష్టిస్తున్నారు. గత ఏడాది (2024-25)జాతీయ స్థాయిలో సరాసరి పని దినాలు వినియోగించుకున్న మహిళలు 58.1% అయితే ఏపీలో ఇది 60.14% శాతంగా ఉండటం గమనార్హం. రాష్ట్రానికి గత ఏడాది కేటాయించిన 21.51 కోట్ల పనిదినాల్లో మహిళలు 14.57 కోట్లకు పైగా
వినియోగించుకున్నారు.