Home Political news ఉద్యోగ మేళాకు అనూహ్య స్పందన. 4,800 మంది అభ్యర్థులు హాజరుకాగా 1,095 మందికి ఉద్యోగ...

ఉద్యోగ మేళాకు అనూహ్య స్పందన. 4,800 మంది అభ్యర్థులు హాజరుకాగా 1,095 మందికి ఉద్యోగ అవకాశం.

3
0

 ఎన్టీఆర్ జిల్లా, తేది: 28.12.2024

ఉద్యోగ మేళాకు అనూహ్య స్పందన.

4,800 మంది అభ్యర్థులు హాజరుకాగా 1,095 మందికి ఉద్యోగ అవకాశం. 

* ప్రతి నియోజకవర్గం లో జాబ్ మేళాలు నిర్వహిస్తాం. 

* జిల్లా కలెక్టర్ డా.జి. లక్ష్మీశ. 

నగరంలో నిర్వహించిన వికసిత్ భారత్ మెగా జాబ్ మేళాకు అనూహ్య స్పందన లభించిందని 4,800 మందికి పైగా నిరుద్యోగులు హాజరుకాగా వివిధ కంపెనీలు నిర్వహించిన మౌఖిక పరీక్షలో 1,095 మంది ఉద్యోగ అవకాశాలను పొందటం అభినందనీయమని జిల్లా కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. 

వికసిత్ భారత్ మెగా జాబ్ మేళా కార్యక్రమంలో భాగంగా శనివారం విజయవాడ పీబీ సిద్దార్ధ పబ్లిక్ స్కూల్ నందు నిర్వహించిన మెగా జాబ్ మేళా ముగింపు కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ లక్ష్మీశ హాజరై నియామకపు పత్రాలను అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాధ్ సహకారంతో నిర్వహించిన జాబ్ మేళాకు అనూహ్య స్పందన లభించిందన్నారు. మూడు వేల మంది నిరుద్యోగులు హాజరవుతారని అంచనా వేయడం జరిగిందన్నారు. అయితే 4800 మంది అభ్యర్థులు ఉద్యోగ అవకాశాల కొరకు వారి పేర్లను నమోదుచేసుకున్నారని వారి విద్యార్హతలు పరిగణలోకి తీసుకొని కోరుకున్న కంపెనీలకు ప్రతిపాదించగా ఆయా కంపనీలు నిర్వహించిన మౌఖిక పరీక్షలలో సుమారు 1,095 మంది ఉద్యోగ అవకాశాలను సాధించారన్నారు. ఉద్యోగం పొందిన వారికి నెలకు కనిష్టంగా 15 వేల నుండి గరిష్టంగా 40 వేల వరకు జీతంతో పాటు ఇతర భత్యాలు చెల్లించేలా నియామకపు పత్రాలను అందజేయడం జరిగిందన్నారు. తద్వారా సంవత్సరానికి 2 లక్షల నుంచి 5 లక్షల వరకు జీతాన్ని పొందగలుగుతారన్నారు. 60 ప్రముఖ సంస్థలు ఉద్యోగాలకు మౌఖిక పరీక్షలు నిర్వహించారని ఇందులో స్మార్ట్ బ్రెయిన్స్ సంస్థలో 30, అభ్యరామ్ సొల్యూషన్స్ సంస్థ 25, విప్రో 10, సెంటిల్ ఇండియా 30, సుతేరంలాండ్ గ్లోబల్ సర్వీసెస్ 20, టెక్ మహేంద్ర 25,  ఇసొంక్సపీరియెన్స్స్ 40,  టారస్ సంస్థ 55, కనెక్ట్ బిజినెస్ సొల్యూషన్స్ 10, టెక్నో టాస్క్ బిజినెస్ సొల్యూషన్స్ 25, మహేంద్ర ఫైనాన్స్ 40, యాక్సిస్ బ్యాంకు 10, క్యూస్ కార్పొరేషన్ 20, హెటిరో లాబ్స్ 15, అపోలో ఫార్మసీ 45, మెడ్ ప్లస్ 29, మేడిన్ తెర్మాల్  లిమిటెడ్ 15, ఎల్ అండ్ టి కంస్ట్రక్షన్స్  45, ఇసుజు 36, అపెక్స్ సొల్యూషన్స్ 17, ఇండో మిమ్ 20, పెనాసోనిక్ 27, సేవోయం సమ్మిట్ 29, ఇండస్ కాఫీ ప్రైవేట్ లిమిటెడ్ 14, మహేంద్ర మెక్వెల్ 20, వరుణ్ మోటార్స్ 10, హెచ్ డీబీ ఫైనాన్సియల్ సర్వీసెస్ 25, కోస్టల్ ప్నిఉమాటిక్ ఏజెన్సీస్ 20, సీ ఎల్ ఆర్ ఫెసిలిటీస్ 15, జీయంఆర్ ఎయిర్ కార్గో 36, విజేత సూపర్ మార్కెట్ 20, పీవీపీ స్టాపింగ్ 20, హిప్ క్లౌడ్ 10, బ్లింకిట్ 20 ఉద్యోగ అవకాశాలు కల్పించారన్నారు.  ఆయా సంస్థల యాజమాన్యానికి మేనేజ్ మెంట్ ప్రతినిధులకు  ప్రత్యేక ధన్యవాదలు తెలియజేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఉద్యోగ అవకాశాలు పొందిన నిరుద్యోగులు కష్టపడి పనిచేసి సంస్థకు మంచిపేరు తీసుకురావడంతో పాటు భవిష్యత్తులో పది మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే స్థాయికి ఎదగాలని ఆకాంక్షిస్తున్నట్లు కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here