ఉచిత బస్సు పథకం వలన ఉపాధి దెబ్బతింటున్న ఆటో మోటారు కార్మికులకు న్యాయం చేయాలని రవాణా శాఖ మంత్రి కి వినతిపత్రం అందించిన ఐ ఎఫ్ టీ యూ నాయకులు

6
0

 ఉచిత బస్సు పథకం వలన ఉపాధి దెబ్బతింటున్న ఆటో మోటారు కార్మికులకు న్యాయం చేయాలని రవాణా శాఖ మంత్రి కి వినతిపత్రం అందించిన ఐ ఎఫ్ టీ యూ నాయకులు

                 ఉచిత బస్సు ప్రయాణం పధకం వల్ల జీవనోపాధి కోల్పోనున్న ఆటో మరియు మోటారు రంగ కార్మికులకు ఆర్థిక సహాయంతో పాటు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలని కోరుతూ *రాష్ట్ర రవాణా శాఖ మంత్రి ఎమ్ రాంప్రసాద్ రెడ్డి కి భారత కార్మిక సంఘాల సమాఖ్య( ఐ ఎఫ్ టీ యూ) అనుబంధ ఏపీ ప్రగతిశీల ఆటో మరియు మోటారు వర్కర్స్ యూనియన్ నాయకులు శనివారం  క్యాంప్ ఆఫీసులో మంత్రిని కలసి వినతిపత్రం అందించారు.*. 

           ఇటీవల జరిగిన లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా  టిడిపి కూటమి ఎన్నికల వాగ్దానాల్లో మహిళలకు ఉచిత బస్సు పథకం హామీ ఇచ్చింది . ఈ కారణంగా ఉపాధిని కోల్పోతున్న ఆటో, క్యాబ్ తదితర మోటార్ కార్మికులకు  కొన్ని సంక్షేమ పథకాలు కూడా ప్రకటిస్తూ  ఎన్నికల ప్రణాళిక లో హామీ ఇచ్చింది . కావున ఉచిత బస్సు పథకం అమలుతో పాటు ఆటో, క్యాబ్ మోటార్ కార్మికులకు కూడా కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కోరుతున్నట్లు మంత్రిని ఐ ఎఫ్ టీ యూ నాయకులు కోరారు.ఆటో, మోటార్ కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన  ఎన్నికల హామీల అమలు కి సంబంధించి రాష్ట్రంలోని ఆటో మోటార్ కార్మిక సంఘాలతో ఒక సమావేశం నిర్వహించి ఆయా కార్మిక సంఘాల అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకోవాలని కోరారు.  ఏడాదికి 15 వేల రూపాయలు చొప్పున సొంత వాహనం ఉన్నా లేకపోయినా మొత్తం ఆటో కార్మికులకు సహాయంగా అందిస్థామని ఇచ్చిన టిడిపి కూటమి హామీని పెంచి అమలు చేయాలని మంత్రికి నాయకులు గుర్తు చేసారు. ఇందుకు ఆటో కార్మికుల బ్యాడ్జీని ఆధారంగా చేసుకుంటామని చెప్పినప్పటికినీ ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం బ్యాడ్జీని రద్దుచేసి లైట్ వెయిట్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ను ఆటో కార్మికులకు కూడా వర్తింప చేస్తున్నట్లు మంత్రికి వారు తెలిపారు. కావున ఈ విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకొని బ్యాడ్జితో పాటు అది లేక పోయినా లైట్ వెయిట్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా పరిగణనలోకి తీసుకొని సొంత వాహనాలతో నిమిత్తం లేకుండా ప్రతి ఆటో, మోటారు డ్రైవర్ కి ఏడాదికి 25 వేల రూపాయల చొప్పున లేదా నెలకు 2000 రూపాయిల చొప్పున సహాయంగా అందించాలని మంత్రిని వారు కోరారు.  టిడిపి కూటమి ఎన్నికల హామీలలో మోటారు రంగానికి సంబంధించి పెనాల్టీల జీవో నెంబర్ 21ని రద్దు చేస్తామని ప్రకటించిందని మంత్రికి తెలిపారు. కావున సదరు జీవో నెంబర్ 21ని రద్దుచేసి  2019కి ముందు నాటి పాత పెనాల్టీలను యధావిధిగా అమలు చేయాలని కోరుతున్నట్లు చెప్పారు. ఆటో మోటార్ కార్మికులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి మరిన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తామని కూడా కూటమి ఎన్నికల మేనిఫెస్టోలో  ప్రకటించింది . కావున తక్షణం అన్ని ఆటో, మోటార్ కార్మిక సంఘాల అభిప్రాయాలను తీసుకొని సమగ్రమైన పథకాలతో కూడిన ఆటో మోటార్ కార్మికుల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయగలరని, ఈ బోర్డులో అన్ని కార్మిక సంఘాల ప్రతినిధులకు అవకాశం కల్పించాలని కోరారు. జీబ్రా గీతల మీదకు వచ్చినా, సిగ్నల్ జంపింగ్ వగైరాల పేర్లతో పోటోలు తీసి భారీగా పెనాల్టీలు వేస్తున్నట్లు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు . పైగా వాటిని బండి ఫిట్నెస్ కి వచ్చినప్పుడు చూపించి అవన్నీ కడితేనే బ్రేక్ చేస్తున్నట్లు చెప్పారు . కావున ఈ పద్ధతిని రద్దు చేయాలని మంత్రిని నాయకులు కోరారు.గత ప్రభుత్వంలో 300 యూనిట్లు కరెంటు వాడిన వారికి పథకాలు రద్దు చేసినట్లు మంత్రి తెలిపారు.ఆదాయం లేకున్నా బ్యాంకు రుణాల కొరకు ఐటి రిటర్న్స్ కట్టిన వారి రేషన్ కార్డులు రద్దు చేసింది. 300 యూనిట్ల నిబంధన రద్దు చేసి పథకాలు అమలు చేయాలని, రద్దు చేసిన ఆటో కార్మికుల రేషన్ కార్డులను పునరుద్ధరించాలని కోరారు. కూటమిలో భాగమైన కేంద్ర ప్రభుత్వం భారత న్యాయ చట్టాలను మార్చుతూ భారత న్యాయ సంహిత తదితర పేర్లతో మూడు చట్టాలను తీసుకుని వచ్చింది. ఈ చట్టాలలో అనేక అస్పష్టతలు ఉన్నాయి. ప్రజలకు మరింత సులువుగా న్యాయం అందించే దానికి బదులుగా చట్టాలను ప్రజలకు భారంగా మరింత కష్టంగా మార్చుతూ కొత్త చట్టాలు తీసుకువచ్చారు. ముఖ్యంగా మోటార్ రంగానికి సంబంధించిన చట్టాల సవరణలలో ప్రమాదాలకు సంబంధించి గతంలో ఉన్న నిబంధనల ప్రకారం ప్రమాదంలో అవతలి వ్యక్తి చనిపోయి డ్రైవర్ బాధ్యునిగా తేలితే విధించే శిక్షను రెండు సంవత్సరాల నుండి ఏడు సంవత్సరాలకి పెంచారు. పైగా కొద్ది నెలలుగా ఉండే జైలు శిక్షను పది సంవత్సరాలకు పెంచారు. ఈ శిక్షలు మోటార్ కార్మికుల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. అందుకే వీటికి వ్యతిరేకంగా గత జనవరిలో దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన జరిగింది. ఆ సందర్భంగా ఈ సెక్షన్ల అమలును కేంద్ర ప్రభుత్వం తాత్కాలికంగా నిలుపుదల చేసింది. వీటిని రద్దు చేయాలనీ, అదేవిధంగా కొత్త మూడు చట్టాలలో ప్రజలకు ఇబ్బందికరంగా ఉన్న వాటిని సవరించాలని చట్టాల అమలుపై ఉన్న అస్పష్టతలను తొలగించాలని మంత్రిని వారు కోరారు.ఈ మేరకు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి నివేదించాలని కోరుతున్నాం.

 *మంత్రి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ఉచిత బస్సు ప్రయాణ పధకం వల్ల నష్టపోయే కార్మికులందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఆటో, మోటారు వర్కర్స్ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసి సూచనలు, సలహాలు తీసుకుంటామని ఐ ఎఫ్ టీ యూ నాయకులకి హామీ ఇచ్చారు. ఐ ఎఫ్ టీ యూ ఆటో, మోటారు వర్కర్స్ యూనియన్ నాయకులు ఎ.రవిచంద్ర, డి.శ్రీనివాసరావు, ముని శంకర్, సీహెచ్ పెద్ది రాజు, పి.రఫీ ఖాన్, డి.శ్రీధర్ బాబు, రాము* తదితరులు వినతి పత్రం అందించిన వారిలో ఉన్నారు.

   

           

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here