ఈ నెల 18న విజయవాడలో మెగా జాబ్ మేళా యువ‌తీయువ‌కులు సద్వినియోగం చేసుకోవాలి జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌*

4
0

ఎన్‌టీఆర్ జిల్లా, జులై 15, 2025

ఈ నెల 18న విజయవాడలో మెగా జాబ్ మేళా..

  • యువ‌తీయువ‌కులు సద్వినియోగం చేసుకోవాలి
  • జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌

రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు క‌ల్పించే ఉద్దేశంతో ఈ నెల 18వ తేదీన విజయవాడ మొగ‌ల్రాజ‌పురంలోని పీబీ సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ క‌ళాశాల‌లో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ తెలిపారు.
మంగ‌ళ‌వారం క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ అధికారుల‌తో క‌లిసి జాబ్ మేళా కేలండ‌ర్‌తో పాటు మెగా జాబ్ మేళా పోస్ట‌ర్ల‌ను ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ జాబ్ మేళాలో ఎఫ్ట్రానిక్స్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్, సాండ్ స్పేస్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, విక్టర్ ఇండియన్ టెక్నికల్ సపోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్, ముత్తూట్ మైక్రోఫిన్ లిమిటెడ్, జస్ట్ డయల్ లిమిటెడ్,హెటిరో ల్యాబ్స్ లిమిటెడ్, యాక్సిస్ బ్యాంక్, జోయలుక్కాస్ ఇండియా లిమిటెడ్, ఆర్.ఆర్ ట్రేడర్స్ అండ్ మ్యానుఫ్యాక్చరర్స్, బ్లూ డార్ట్ ఎక్స్ప్రెస్ లిమిటెడ్, జ్యోతి ఫెసిలిటీ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, శ్రీ బాలాజీ గ్లోబల్ ఇన్సూరెన్స్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్, శ్రీ లక్ష్మీ సాయి ఇంటర్నేషనల్ డెంటల్ కేర్, ముత్తూట్ మినీ ఫైనాన్సియర్స్ లిమిటెడ్, ఫాక్స్ కాన్, ఇన్నోసోర్స్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, కూరాకు ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, ఎస్.వి గ్లోబల్ సొల్యూషన్స్, ముక్కు ఫైనాన్షియల్ కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్, ఇసుజు మోటార్స్ లిమిటెడ్ వంటి సుమారు 25 కంపెనీలు పాల్గొంటాయ‌ని తెలిపారు. ఉద్యోగాలకు ప‌దో త‌ర‌గ‌తి, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్‌, బీఫార్మ‌సీ, పీజీ పూర్తిచేసిన 18 నుండి 35 సంవత్సరాల లోపు యువత అర్హులని, ఎంపిక అయిన వారికి మంచి వేతనంతోపాటు ఇతర సౌకర్యాలు ఉంటాయ‌న్నారు. అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించడం ద్వారా ఉద్యోగాలకు ఎంపిక చేయ‌డం జ‌రుగుతుంద‌న్నారు. ఆసక్తి , త‌గిన అర్హతలు గల అభ్యర్థులు ముందుగా https://naipunyam.ap.gov.in/user-registration లింక్ ద్వారా తప్పనిసరిగా తమ పూర్తి వివరాలతో రిజిస్టర్ కావడంతోపాటు, మెగా జాబ్ మేళాకు రెజ్యూమె లేదా బయోడేటా, ఆధార్, ఆధార్‌కు లింక్ అయిన ఫోన్ నంబర్, పీఏఎన్‌, సర్టిఫికెట్ల జిరాక్సు కాపీలతో రావాలని తెలిపారు. మరిన్ని వివరాలకు 9959984226, 9347779032 నంబర్లను సంప్రదించవ‌చ్చ‌ని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ వివ‌రించారు. కార్య‌క్ర‌మంలో జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎస్‌.శ్రీనివాస‌రావు, డీఆర్‌డీఏ పీడీ కేఎన్‌వీ నాంచార‌రావు, గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల ప్ర‌త్యేక అధికారి జి.జ్యోతి త‌దిత‌రులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here