7-8-2025
నియోజకవర్గంలోని ఇళ్ల పైకప్పుల పై సౌర పలకలు ఏర్పాటు చేసుకొని సౌర విద్యుత్ పొందడానికి ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన పథకాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకునేలా ప్రజలకు అవగాహన చేయండి -MLA బొండా ఉమా
ధి:7-8-2025 గురువారం ఉదయం 11:30″గం నుండి ” సింగ్ నగర్ లోని సెంట్రల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ” “ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన” పథకంపై ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు అధ్యక్షతన” సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇంచార్జ్ లకు, డివిజన్ పార్టీ ఇన్చార్జిలకు, అధ్యక్ష ప్రధాన కార్యదర్శులకు, BLA లకు శిక్షణ తరగతులను నిర్వహించి పూర్తి సమాచారం అందించే కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది.
ఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ భవిష్యత్తులో కరెంటు చార్జీలు ఉండని సోలార్ ద్వారా నియోజకవర్గం లోని 267 బూత్ లెవెల్ ఏజెంట్లకు పూర్తి వివరాలను అందించి, ప్రతి ఇంటికి సోలార్ విద్యుత్ వాడకండి ఇంటి యజమానులకు తెలియజేసి వారి ద్వారా రాయితీలు పొందే ఆయనకు రుణాలు ఇచ్చే సోలార్ పలకలను తక్షణమే ఏర్పాటు చేసుకునే విధంగా కార్యకర్తలు, RP, లు అధికారులు పనిచేయాలని…
నియోజకవర్గంలో ప్రజలకు కరెంటు చార్జీలు ఎక్కువగా వస్తున్నాయి ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో దానికి ప్రత్యామ్నాయ మార్గంగా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇజంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రవేశపెట్టినటువంటి “ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన” పడకంపై ప్రజలకు ఒక అవగాహన కల్పించాలని
గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వం చెల్లించవలసినటువంటి కరెంటు బకాయిలను కూడా నేడు NDA కూటమి ప్రభుత్వం పై పడడం వల్ల విద్యుత్ వినియోగదారులు ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని గ్రహించినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆంధ్రప్రదేశ్లో సోలార్ ద్వారా విద్యుత్ ఉత్పత్తిని ఉత్పత్తి చేస్తూ ప్రతినెల దానిలో నుండి వినియోగదారుడు విద్యుత్ వాడుకునే విధంగా ప్రణాళికలు సిద్ధం చేశారని అలాగే 3 కిలోవాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి ఏర్పాటు చేయడానికి రూ.1.45 లక్షలు ఖర్చు అయితే గరిష్టంగా రూ.78 వేలు రాయితీగా అందిస్తుంది అని, అవసరమైతే బ్యాంకు రుణం కూడా పొందవచ్చు, ఇంటిపై ఏర్పాటు చేసుకునే సోలార్ వ్యవస్థ ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్తులో తొలి 300 యూనిట్లు లబ్ధిదారుడు ఉచితంగా వాడుకోవచ్చు అని…
మిగిలిన యూనిట్లను నెట్ మీటరింగ్ ద్వారా విక్రయించుకుని వినియోగదారుడు ఆదాయం కూడా పొందొచ్చు అని,
1 కిలో వాట్ రూ.30 వేలు, 2 కిలో వాట్లకు రూ.60 వేలు, 3 కిలో వాట్లకు రూ.78 వేలు సబ్సిడీ రాయితీ అందుతుంది అని
కాలనీవాసుల సంక్షేమ సంఘాలు, బృందంగా నివాసాలు ఏర్పాటు చేసుకున్న వారు ఉమ్మడి ప్రాంతంలోని విద్యుత్ దీపాలు, వాహనాల చార్జింగ్ స్టేషన్ల కోసం 500 కిలో వాట్ల వరకు రూఫ్ టాప్ సోలార్ వ్యవస్థ ఏర్పాటు చేసుకోవచ్చుఅని…
ఇందుకోసం ఒక్కో కిలోవాటుకు 18 వేల వరకు రాయితీ లభిస్తుంది అని, సోలార్ విద్యుత్ ఉత్పత్తి వ్యవస్థ ఏర్పాటుకు సబ్సిడీ మొత్తాన్ని ప్రభుత్వమే ఇస్తుంది అని, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో 1,80,000 వేల ఇల్లు ఉన్నాయని అందులో దాదాపుగా 50వేల ఇళ్లకు సోలార్ పలకలు అమర్చిన నియోజకవర్గం ఒక ధర్మల్ పవర్ స్టేషన్ గా మారుతుందని దీని ద్వారా ఎంతో కరెంటును ఉత్పత్తి చేయవచ్చని ప్రజలకు దీని పట్ల అవగాహన తీసుకొని రావాలని బొండా ఉమా సూచించారు.
ఈ కార్యక్రమంలో:- టిడిపి రాష్ట్ర కార్యదర్శి, నియోజకవర్గ కోఆర్డినేటర్ నవనీతం సాంబశివరావు, ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ఘంటా కృష్ణమోహన్, క్లస్టర్ ఇంచార్జ్ దాసరి కనకారావు, కో క్లస్టర్ మరక శ్రీనివాస్, కంచి ధన శేఖర్, పిరియా సోమేశ్వరరావు, సర్వేపల్లి అమర్నాథ్, వింజమూరి సతీష్, డివిజన్ అధ్యక్ష, ఇంచార్జ్, ప్రధాన కార్యదర్శులు, నియోజకవర్గ బూత్ లెవల్ ఏజెంట్లు పాల్గొన్నారు