
ఎన్‌టీఆర్ జిల్లా, నవంబర్ 03, 2025
ఇప్పటికే ఎన్‌హెచ్ఏఐకు 1,548 ఎకరాల 3ఏ ప్రతిపాదనలు
- మరో 1,763 ఎకరాలకు ఈ నెల 4న ప్రతిపాదనలు పంపుతాం
- ఓఆర్ఆర్ భూ సేకరణపై కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
నవ్య రాజధాని అమరావతికి కీలకమైన ఓఆర్ఆర్ భూసేకరణకు సంబంధించి ప్రతిపాదనల రూపకల్పన,
జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్ఏఐ)కు సమర్పించే ప్రక్రియ దాదాపు పూర్తయిందని.. మొత్తం 3,312 ఎకరాల 16 సెంట్లకు గాను 1,548.37 ఎకరాలకు ఇప్పటికే 3ఏ ప్రతిపాదనలను పంపించినట్లు జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. మిగిలిన దాదాపు 1,763 ఎకరాలకు సంబంధించిన 3ఏ ప్రతిపాదనలను ఈ నెల 4వ తేదీన పంపనున్నట్లు వివరించారు. 3ఏ ప్రతిపాదనల రూపకల్పనలో జాప్యం అనేది లేకుండా ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి అధికారులతో సమన్వయం చేసుకుంటూ ప్రక్రియ పూర్తికి కృషిచేస్తున్నట్లు పేర్కొన్నారు. విజయవాడ, నందిగామ డివిజన్ల పరిధిలోని మైలవరం, జి.కొండూరు, కంచికచెర్ల, వీరుళ్లపాడు మండలాల్లో భూ సేకరణకు ప్రతిపాదనలు పంపుతున్నట్లు కలెక్టర్ లక్ష్మీశ వివరించారు.
![]()
