ఇన్ఫోసిస్ ఫౌండేషన్, శ్రీ రామకృష్ణ సేవాశ్రమ సేవలు అభినందనీయమని పశ్చిమ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ సుజన చౌదరి అన్నారు.

Spread the love

 సమాజ సేవలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి

ఎమ్మెల్యే సుజన చౌదరి

తోటి వారికి సాయపడాలనే మంచి మనసుతో వరద బాధితుల సహాయార్థం నిత్య అవసరాలను అందిస్తున్న ఇన్ఫోసిస్ ఫౌండేషన్, శ్రీ రామకృష్ణ సేవాశ్రమ సేవలు అభినందనీయమని పశ్చిమ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజన చౌదరి) అన్నారు.

ఇన్ఫోసిస్ ఫౌండేషన్, ఆధ్వర్యంలో శ్రీరామకృష్ణ సేవాశ్రమ సారధ్యంలో బుధవారం ఊర్మిళా నగర్ లోని హెచ్2ఓ ఫంక్షన్ హాల్ లో వరద బాధితులకు నిత్యవసరాలను అందజేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే సుజనా హాజరై బాధితులకు నిత్య అవసరాలను తమ చేతుల మీదుగా పంపిణీ చేశారు. అనంతరం సుజనా మాట్లాడుతూ  వరదల వల్ల నిరాశ్రయులైన బాధితులను ఆదుకోవడానికి మానవతా దృక్పథంతో మేము  సైతం అంటూ ముందుకు వచ్చిన సంస్థల సేవలు అభినందనీయమన్నారు. సమాజ సేవలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యాలు కావాలన్నారు. ప్రభుత్వాలు చేతనైనంత సాయం మాత్రమే చేస్తాయని ప్రతి ఒక్కరూ తోటి వారికి సాయ పడాలన్నారు. వరద విపత్తు సమయంలో పశ్చిమ ప్రజలకు సుజనా ఫౌండేషన్ సిబ్బంది , కార్యాలయ సిబ్బంది, కూటమినేతల సహకారంతో వేగవంతంగా సేవలను అందించామన్నారు.  శాసనసభ్యునిగా గెలుపొందిన తర్వాత తొలిసారిగా నిర్వహిస్తున్న దసరా పండుగ ఎంతో ప్రత్యేకమైనదని దసరా ఉత్సవాలను మరింత వైభవంగా నిర్వహించేందుకు కృషి చేస్తున్నామన్నారు. బాధితులకు నిత్య అవసరాలను పంపిణీ చేసిన ఇన్ఫోసిస్ మమతా ఫౌండేషన్, శ్రీరామకృష్ణ సేవాశ్రమ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. 

శ్రీరామకృష్ణ సేవాశ్రమ స్వామి జపానంద  మహారాజ్ వారు మాట్లాడుతూ గత 30 ఏళ్లుగా అనేక సేవా కార్యక్రమాలను దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నామన్నారు. ప్రకృతి విపత్తు వలన ఈ ప్రాంతానికి వరదలు రావడం బాధాకరమైన విషయం అన్నారు. ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ద్వారా శ్రీరామకృష్ణ సేవాశ్రమం నేతృత్వంలో పశ్చిమ లోని వరద బాధితులకు 2000 వేల మందికి నిత్యవసర కిట్లను అందజేశామన్నారు. టవళ్లు, చీరలు, దుప్పట్లు, కందిపప్పు రైస్, నూనె, గోధుమపిండి తదితర నిత్య అవసరాలను అందజేశారు. కార్యక్రమంలో కూటమి నేతలు చంద్రమౌళి, సతీష్, అడ్డూరి శ్రీరామ్, పైలా సోమినాయుడు, దుర్బేసుల హుస్సేన్, బొమ్మసాని సుబ్బారావు ఇన్ఫోసిస్ మమత ఫౌండేషన్ సీనియర్ డెలివరీ ఇంచార్జ్ వంశీ పరంజ్యోతి, దేవన బోయిన వెంకట్  కూటమి నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *