విజయవాడ – పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయం.
ఇటీవల ఎమ్మెల్యే సుజనా చౌదరి పై వైసీపీ నేత పోతిన మహేష్ చేసిన వ్యాఖ్యలపై పశ్చిమ నియోజకవర్గ కూటమి కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు
పశ్చిమ నియోజకవర్గ కూటమి కార్పొరేటర్ల కామెంట్స్..
పశ్చిమ నియోజకవర్గం 45 వ డివిజన్ సితార సెంటర్ లో ఫుడ్ కోర్ట్ ఏర్పాటు పై పోతిన మహేష్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నాం.
వాస్తవానికి ఈ ఫుడ్ కోర్ట్ కు రెండేళ్ల క్రితమే అనుమతులు వచ్చాయి.
అప్పుడు అనుమతులు వచ్చిన సమయంలో అధికారంలో ఉన్నది వైసీపీ ప్రభుత్వమే.
గతంలోనే అక్కడ నేషనల్ హైవే ను ఆనుకొని అనధికారికంగా అడ్డగోలుగా చాలామంది వ్యాపారాలు చేసి అక్రమాలకు పాల్పడిన విషయం పోతిన మహేష్ తెలుసుకోవాలి..
అపుడు అలాంటి వారి నుంచి పోతిన మహేష్ కు ఏమైనా ముడుపులు అందాయేమో ఆయనకే తెలియాలి.
అభివృద్ధి ని అడ్డుకోవడం కోసమే పోతిన మహేష్ లాంటి వాళ్ళు ఆ ఫుడ్ కోర్ట్ లు బార్ లు, మందు షాప్ లకు మంచింగ్ కోసం అని నోటిదురుసు మాటలు మాట్లాడుతున్నారు.
నియోజకవర్గంలో అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే సుజనా చౌదరి దృష్టి పెట్టారు.
అక్కడ రోడ్డు విస్తరణ, డ్రెయిన్లు మరమత్తులు చేయాల్సి ఉంది కాబట్టి వాటి మీద కూడా దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. సుజనా చౌదరి గారిది కేవలం అభివృద్ధి మంత్రమే తప్ప వైసీపీ నాయకుల మాదిరిగా నీచ రాజకీయాలు చేయరు అన్న విషయం ప్రజలందరికీ తెలుసు.
ప్రతి కార్యక్రమంలోనూ వైసీపీ ప్రజాప్రతినిధులను కూడా భాగస్తులు కావాలని కోరడం ఆయన హుందాతనం అని తెలుసుకోవాలి..
నియోజకవర్గంలో అభివృద్ధిని చూసి ఓర్వలేకే పోతిన మహేష్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు.
వాస్తవాలు తెలుసుకోకుండా ఎమ్మెల్యే సుజనా చౌదరి పై ఇష్టారాజ్యంగా నోటికొచ్చినట్టు మాట్లాడితే సహించేది లేదని హెచ్చరిస్తున్నాం.
కార్పొరేటర్లు బుల్లా విజయ్ కుమార్, మైలవరపు మాధురి లావణ్య , మరుపిళ్ళ రాజేష్, అత్తలూరి ఆదిలక్ష్మి పెద్దబాబు, మైలవరపు రత్నకుమారి దుర్గారావు, మహాదేవు అప్పాజీరావు, టీడీపీ సీనియర్ నేత మైలవరపు కృష్ణ పాల్గొన్నారు