ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం పేదవాడి ఆకలి తీరుస్తాం ఎమ్మెల్యే సుజనా చౌదరి

Spread the love

 ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం పేదవాడి ఆకలి తీరుస్తాం 

ఎమ్మెల్యే సుజనా చౌదరి

పశ్చిమ లో ఏర్పాటు చేసిన కాళేశ్వరరావు మార్కెట్, భవానిపురం, హెచ్ బి కాలనీలలోని, అన్నా క్యాంటీన్లను విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాద్ తో కలిసి ఎమ్మెల్యే సుజనా చౌదరి శుక్రవారం ప్రారంభించారు. అనంతరం పేదలకు  అల్పాహారాన్ని వడ్డించారు.హరే రామ మూమెంట్స్, అక్షయ పాత్ర చారిటబుల్ ఆధ్వర్యంలో అన్న క్యాంటీన్ల నిర్వహణ కొనసాగుతుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు. పేదలకు కడుపు నింపే అన్న క్యాంటీన్లను వైసీపీ ప్రభుత్వం అమలు చేయలేదని ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం అధికారంలో వచ్చిన 100 రోజుల్లోపు  సీఎం చంద్రబాబు అన్న క్యాంటీన్లను పునరుద్ధరించి పేదవాడి కడుపు నింపి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారన్నారు. ఎంపి కేశినేని శివనాథ్ చిన్ని మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 100 క్యాంటీన్లకు  పైగా  ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారన్నారు. గత ప్రభుత్వ పాలనలో అన్న క్యాంటీన్లను మూసివేస్తే మొబైల్ అన్న క్యాంటీన్లను ఏర్పాటుచేసి  పేదవారి ఆకలి తీర్చామన్నారు. పేదల కడుపు నింపే ఈ అన్న క్యాంటీన్ల నిర్వహణకు దాతలు విరివిగా విరాళాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన, మున్సిపల్ కమిషనర్ జ్ఞానచంద్ర, అడిషనల్ కమిషన్ జనరల్ మహేష్, జోనల్ కమిషనర్ రమ్య కీర్తన, నాయకులు పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ నాగుల్ మీరా, ఎన్టీఆర్ జిల్లా బిజెపి అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్, ఎమ్మెస్ బేగ్, ఫతావుల్లా, కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *