విజయవాడ
22 జనవరి 2025
ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గమ్మ గుడి ప్రధాన అర్చకులు లింగంబోట్ల బద్రీనాథ్ బాబు మృతి పట్ల దేవాదాయ
శాఖ మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి సంతాపం
ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ప్రధాన అర్చకులు శ్రీ లింగం బొట్ల బద్రీనాథ్ బాబు అకాల మరణం ఎంతో బాధాకరం. వారి అకాలమరణం తీరని లోటు.
ప్రధాన అర్చకులుగా శ్రీ లింగం బొట్ల బద్రీనాథ్ బాబు , అమ్మవారి అలంకరణ, ఆచార వ్యవహారాల్లో అపారమైన అనుభవం తో సేవలందించారు. భక్తులకు తగిన ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం అందించిన ఆయన సేవలు అందరికీ స్ఫూర్తిగా నిలుస్తాయి.
ఆయన కుటుంబ సభ్యులకు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. “వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను,”