ఇంద్రకీలాద్రి దుర్గమ్మ ఆలయానికి కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ విజయేంద్ర సరస్వతీ స్వామి వారిని ఆహ్వానించిన పాలకమండలి ఛైర్మన్ మరియు ఆలయ కార్యనిర్వహణాధికారి

Spread the love

ఇంద్రకీలాద్రి దుర్గమ్మ ఆలయానికి కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ విజయేంద్ర సరస్వతీ స్వామి వారిని ఆహ్వానించిన పాలకమండలి ఛైర్మన్ మరియు ఆలయ కార్యనిర్వహణాధికారి :
విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ), కార్యనిర్వహణాధికారి వి.కె. శీనా నాయక్ (స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్), ఆలయ స్థానాచార్యులు వి. శివ ప్రసాద్ శర్మ, మరియు ఆలయ వైదిక కమిటీ సభ్యులు సంయుక్తంగా కంచి కామకోటి పీఠం 70వ పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ విజయేంద్ర సరస్వతీ స్వామి వారిని కలిశారు.
తాడేపల్లి సమీపంలోని నూతన ఇస్కాన్ (ISCON) ఆలయం వద్ద స్వామి వారిని కలిసిన దేవస్థానం ప్రతినిధులు, ఇంద్రకీలాద్రి ఆలయాన్ని సందర్శించి భక్తులకు సందేశం అందించవలసిందిగా ఆహ్వానించారు. ఈ ఆహ్వానాన్ని మన్నించిన శ్రీ స్వామి వారు, ఒకటి రెండు రోజుల్లో దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానానికి విచ్చేసే అవకాశముందని ఆలయ అధికారులు తెలిపారు.
ఈ మేరకు పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తామని ఆలయ చైర్మన్ మరియు కార్యనిర్వహణాధికారి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Loading