ఇంద్రకీలాద్రి కార్యనిర్వాహనాధికారి కె ఎస్ రామరావు ఆలయం లోని అన్ని విభాగముల అధికారులతో సమావేశం నిర్వహించడం జరిగినది.

Spread the love

 ఇంద్రకీలాద్రి కార్యనిర్వాహనాధికారి కె ఎస్ రామరావు ఆలయం లోని అన్ని విభాగముల అధికారులతో సమావేశం నిర్వహించడం జరిగినది. 

26-06-2024: 

శ్రీ కార్యనిర్వాహనాధికారి కె ఎస్ రామరావు ఆలయం లోని అన్ని విభాగముల అధికారులతో సమావేశం నిర్వహించడం జరిగినది. దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్దానము, ఇంద్రకీలాద్రి, విజయవాడ:

            దేవస్థానం నందు రానున్న ఆషాడ మాసం మరియు శాకాంబరీ దేవి ఉత్సవములు పురస్కరించుకొని భక్తుల సౌకర్యార్థం చేయవలసిన ఏర్పాట్లు గురించి ఈరోజు మహామండపం 4 వ అంతస్తు నందు ఆలయ కార్యనిర్వాహనాధికారి కె ఎస్ రామరావు ఆలయం లోని అన్ని విభాగముల అధికారులతో సమావేశం నిర్వహించడం జరిగినది. ఈ సమావేశం నందు ఆలయ కార్యనిర్వహణాధికారి తో పాటుగా ఆలయ స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద శర్మ మరియు వైదిక సిబ్బంది, కార్యనిర్వాహక ఇంజినీర్లు కే.వి.ఎస్ కోటేశ్వర రావు, లింగం రమ , DEE, AEE లు, AEO లు, పర్యవేక్షకులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

  సమావేశం నందు ఆషాడ మాసం(06-07-2024 నుండి 05-08-2024) మరియు దేవస్థానం నందు జూలై 19 నుంచి 21 వరకు నిర్వహించు శాకంబరీ దేవి ఉత్సవముల గురించి, వివిధ విభాగముల వారు చేపట్టవలసిన విధుల గురించి చర్చించారు. గతంలో శాకంబరి దేవి ఉత్సవములను రైతులు, వ్యాపారులు మరియు అందరూ ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు సమర్పించి శాకంబరీ దేవి ఉత్సవముల నందు పాలుపంచుకుని దిగ్విజయం చేయడం జరిగిందని, ఈ ఏడాది కూడా ప్రజలు అందరూ ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు దేవస్థానం నందు సమర్పించి రసీదు పొంది 

శాకంబరీ దేవి ఉత్సవములు అంగరంగ వైభవంగా నిర్వహించుటలో పాలు పంచుకొని అమ్మవారి స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. అదేవిధంగా ఆషాడ మాసం సందర్భంగా జగజ్జనని అమ్మవారికి భక్తులు పెద్ద ఎత్తున పవిత్ర సారే సమర్పించు సందర్భంగా భక్తుల కొరకు దేవస్థానం వారు ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. ఆలయం నందు వర్షాలు సమృద్ధిగా పడి, పాడిపంటలతో రాష్ట్రం మరియు రైతులు సుభిక్షంగా ఉండాలని నిర్వహించు శాకంబరీ దేవి ఉత్సవములలో అందరూ పాలుపంచుకొని అమ్మవారి స్వామివారి కృపకు పాత్రులు కావలసిందిగా కోరారు.

మరియు తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ ఉమ్మడి దేవాలయాల కమిటీ వారు గత సంవత్సరంల వలే ఈ ఏడాది కూడా జులై 14న బ్రాహ్మణ వీధి, జమ్మిదొడ్డి నుండి ఊరేగింపుగా బయలుదేరి ఆలయం కు చేరుకొని అమ్మవారికి బంగారు బోనం, పట్టు వస్త్రాలు సమర్పించి పూజలు నిర్వహించుటకు కావలసిన ఏర్పాట్లు గురించి చర్చించారు..

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *