ఇంద్రకీలాద్రిపై శ్రీ అమ్మవారు పౌర్నమి మూడు రోజుల పాటు జరిగిన “మహా పూర్ణాహుతి”, కలశోద్వాసన, మార్జనము, ప్రసాద వితరణ, “ఉత్సవ సమాప్తి”.
గురువారం ఘనఁగా ముగిసాయి. పౌర్ణమి సందర్బముగా ఈ రోజు శ్రీ అమ్మవారు (బంగారు) స్వర్ణ కవచ అలంకారం తో పాటు శాకంబరీ దేవి గా వివిధ రకములైన డ్రై పూట్స్, పళ్ళు, కూరగాయల అలంకరణ లో భక్తులకు దర్శన మిచ్చినారు.
ముగింపు రోజున ఆలయ స్ధానాచార్య శివ ప్రసాద్ అర్చకులు వారు, వైదిక కమిటీ, వేదపఁడితులు, అర్చక స్వాములు కలిసి సప్తశతి హవనం, మహా విద్యా పారాయణం, శాంతి పౌష్టిక హోమం, కూష్మాండ బలి తదితర కార్యక్రమాలు నిర్వహించారు.
వి.కె.శీనా నాయక్, యం.ఎ., ప్రత్యేక శ్రేణి ఉప కలెక్టరు & కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ సకాలములో వర్షాలు బాగా పంటలు సమృద్ధిగా పండాలని ప్రజలు మరియు రైతులు సుఖసంతోషాలతో, దేశం మరియు రాష్ట్రం అభివృద్ధి బాటలో సాగాలనే సంకల్పముతో సమృద్ధిగా వర్షాలు కురవాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపినారు.
మూడు రోజుల ది.08.07.2025, మంగళవారము నుండి ది.10.07.2025,గురువారము వరకు మొత్తఁ 36 టన్నుల కూరగాయలతో మరియు పల్లు, డ్రై ప్యూట్స్ తో (రైతులు, దాతలు ఇచ్చిన విరాళములు తో మాత్రమే) 3 రోజులు కూడా గర్భగుడిని, ఉప ఆలయాలను కూరగాయలు, పండ్లతో ఇతర ఆలయ ఆవరణలో అలంకరించారు. ఉత్సవాల సందర్భంగా ఆలయ నిర్వాహకులు 3 రోజులు భక్తులకు ఉచితముగా కూరగాయలతో తాయారు చేసిన ‘కదంబం’ ప్రసాదాన్ని అందించారు.
ఆలయ కార్యనిర్వహణాధికారి పర్యవేక్షణలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. ఈనెల 8 ప్రారంభమైన ఉత్సవాలు గురువారఁతో ముగిసాయని, సుమారు రెండు లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని ఆయన వివరించారు. నిర్వాహకులు ముగింపు రోజున నిర్వహించిన గిరి ప్రదక్షిణకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.