ఇంద్రకీలాద్రిపై త్వరలో నూతన క్యూ కాంప్లెక్స్ : స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్
విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానానికి నూతన క్యూ కాంప్లెక్స్ నిర్మించేందుకు ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని స్వచ్ఛ్ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అన్నారు.
దసరా శరన్నవరాత్రులలో పదవ రోజైన బుధవారం శ్రీ మహిషాసుర మర్దిని గా దర్శనమిస్తున్న అమ్మవారిని పట్టాభిరామ్ దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ… దుర్గగుడి అభివృద్ధికి ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోందని చెప్పారు. భక్తుల సౌకర్యార్థం నూతన క్యూ కాంప్లెక్స్ నిర్మాణానికి ముఖ్యమంత్రి అంగీకరించారని చెప్పారు. చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం, దేవస్థానం, పోలీస్ శాఖ సమిష్టి గా పటిష్ట ఏర్పాట్లు చేయడం తో దసరా ఉత్సవాలకు హాజరవుతున్న లక్షలాది మంది భక్తులు
ఎటువంటి ఇబ్బంది పడకుండా
అమ్మవారి దర్శనం చేసుకుంటున్నారన్నారు.
నగరం అమ్మవారి నామస్మరణతో మారుమ్రోగుతోందని చెప్పారు. విజయవాడ ఉత్సవ్ తో ఈ దసరా చిరస్మరణీయంగా నిలిచిపోతుందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేశారు.
![]()
