ఇంద్రకీలాద్రికి సీఎం చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు.. స్వాగతం పలికిన ఆలయ అధికారులు

Spread the love

విజయవాడ

ఇం

ద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్న సీఎం చంద్రబాబు

ఇంద్రకీలాద్రికి సీఎం చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు.. స్వాగతం పలికిన ఆలయ అధికారులు

టీడీపీ నేతలు.. కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకున్న చంద్రబాబు

ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం అనంతరం ప్రత్యేక విమానంలో తిరుమల బయలుదేరి వెళ్లి స్వామి వారిని దర్శించుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. అనంతరం ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయం చేయకున్నారు. గన్నవరం నుండి కుటుంబ సభ్యులతో కలిసి రోడ్డు మార్గాన విజయవాడ బయలుదేరి వెళ్లారు. ఇంద్రకీలాదిపై ముఖ్యమంత్రికి ఆలయ అధికారులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. వారితో పాటు టీడీపీ నేతలు కూడా స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారిని కుటుంబసభ్యులతో కలిసి చంద్రబాబు దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనాననంతరం చంద్రబాబు దంపతులకు పట్టువస్త్రాలు, అమ్మవారి ప్రసాదం అందించి వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. అనంతరం ఉండవల్లి నివాసానికి చంద్రబాబు బయలుదేరి వెళ్లారు.

ఈ కార్యక్రమంలో విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని), ఆయన సతీమణి కేశినేని జానకి లక్ష్మీ, మంత్రి కొల్లు రవీంద్ర, గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, టిడిపి జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్, రాష్ట్ర అధికార ప్రతినిధి నాగుల్ మీరా, స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎమ్.ఎస్.బేగ్, టిడిపి నాయకులు కాకు మల్లిఖార్జున యాదవ్ పాల్గొన్నారు..

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *