ఆస్ట్రేలియా హైక‌మిష‌న‌ర్ ఫిలిప్ గ్రీన్ ను క‌లిసిన‌ విజ‌య‌వాడ ఎంపి శివ‌నాథ్ (చిన్ని)

Spread the love

 27-06-2024

ఆస్ట్రేలియా హైక‌మిష‌న‌ర్ ఫిలిప్ గ్రీన్ ను క‌లిసిన‌ విజ‌య‌వాడ ఎంపి శివ‌నాథ్ (చిన్ని) 

ఢిల్లీ : విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) ఆస్ట్రేలియా హై క‌మిష‌న‌ర్ ఫిలిప్ గ్రీన్ ఆహ్వానం మేర‌కు గురువారం సాయంత్రం ఆయ‌న త‌న నివాసంలో ఏర్పాటు చేసిన ప్ర‌త్యేక విందుకి హాజ‌రు కావ‌టం జ‌రిగింది. 18వ లోక్ స‌భ తొలి స‌మావేశాల సంద‌ర్భంగా లోక్ స‌భ స‌భ్యులంద‌ర్నీ ఆస్ట్రేలియా హైక‌మిష‌న‌ర్ ఫిలిప్ గ్రీన్ న్యూఢిల్లీలోని జి శాంతిపథ్ చాణక్యపురి లోని త‌న నివాసంలో ప్ర‌త్యేక విందు ఏర్పాటు చేసి ఆహ్వానించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఆస్ట్రేలియా హై క‌మిష‌న‌ర్ ఫిలిప్ గ్రీన్ కు ఎంపి కేశినేని శివ‌నాథ్ క‌ర‌చాలనం చేసి కాసేపు దేశ ప‌రిస్థితుల‌పై మాట్లాడారు. కేశినేని శివ‌నాథ్ తోపాటు ఈ విందుకి అమ‌లాపురం ఎంపి జి.ఎమ్. హరీష్ బాల‌యోగి, వైజాగ్ ఎంపి శ్రీ భ‌ర‌త్ తో పాటు త‌దిత‌రులు వున్నారు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *