ఆలపాటి విజయానికి కూటమి శ్రేణులు కృషి చేయాలి టిడిపి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎమ్ ఎస్ బెగ్

6
0

 ఆలపాటి విజయానికి కూటమి శ్రేణులు కృషి చేయాలి

టిడిపి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎమ్ ఎస్ బెగ్ 

కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా పోటీలో ఉన్న ఆలపాటి రాజేంద్రప్రసాద్ గెలుపు కోసం ఎన్డీయే కూటమినేతలంతా ఐక్యంగా కృషి చేయాలని టిడిపి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎమ్ ఎస్ బేగ్ కోరారు. ఆలపాటి విజయాన్ని కాంక్షిస్తూ భవానిపురం లోని ఎన్డీయే కార్యాలయంలో కూటమినేతలతో ఆదివారం సమావేశం ఏర్పాటు చేశారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్డీయే కూటమి ప్రభుత్వంలో అన్ని వర్గాలకు మేలు జరుగుతుందన్నారు. 

నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు, కల్పిస్తూ పెనుమార్పులు తీసుకువచ్చి ఆంధ్రప్రదేశ్ ను  అగ్రస్థానంలో నిలిపేందుకు  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని తెలిపారు.

ప్రత్యర్థిని తక్కువ అంచనా వేయకుండా నిర్లక్ష్యం వీడి కూటమినేతలంతా గ్రాడ్యుయేట్ ఓటర్లను కలిసి ఎనిమిది నెలల కాలంలో జరిగిన అభివృద్ధి సంక్షేమాన్ని వివరించి ఓటు వేసే బాధ్యత తీసుకోవాలన్నారు.

ఆలపాటి రాజేంద్రప్రసాద్ గెలుపు కోసం సమిష్టిగా కృషి చేయాలని ఎమ్ ఎస్ బెగ్ పిలుపునిచ్చారు. 

కార్యక్రమంలో ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ ఎన్డీయే కూటమినేతలు సోలంకి రాజు, దాడి మురళీకృష్ణ, పోలిశెట్టి శివ, ప్రత్తి నాగేశ్వరరావు, మోరం సత్యసాయి తదితరులు పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here