ఆర్టీసీ సుబ్బారావు కాలనీ వాసుల మీడియా సమావేశం

Spread the love

 ఆర్టీసీ సుబ్బారావు కాలనీ వాసుల మీడియా సమావేశం 

20 సంవత్సరాల క్రితం ప్లాట్లు వేస్తే కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకుని ఇల్లు కట్టుకొని నివాసం ఉంటున్న తమకు అన్యాయం జరుగుతుందని ఇప్పుడు మా ఫ్లాట్లను మావి కాదని మాపై అన్యాయంగా కొందరు బెదిరింపులు పాల్పడుతున్నారని ఆర్టీసీ సుబ్బారావు కాలనీవాసులు వాపోతున్నారు. నోటీసుల రావడంతో ఇప్పటి కి నలుగురు దిగ్భ్రాంతికి లోనై గుండుపోటుతో మరణించారని ల్యాండ్ మాఫియా వల్ల ఇంకా ఎంతమంది బలి అవ్వాలో అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ విషయమై ఆదివారం ఆర్టీసీ సుబ్బారావు కాలనీ వాసులు కాలనీలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2001లో షేక్ మజీద్ అనే వ్యక్తి ప్లాట్లు వేసి అమ్మకానికి పెడితే వాటిని 42 మంది కొనుగోలు చేసి ఇళ్ళు కట్టుకున్నామని తెలిపారు. కొనుగోలు చేసినప్పుడు, రోడ్లు వేసినప్పుడు, ఇల్లు కట్టుకునేటప్పుడు లేని లక్ష్మీ రామా కో-ఆపరేటివ్ సొసైటీ కొత్తగా పుట్టుకొని వచ్చి అక్రమాలకు పాల్పడుతున్నారని, మా ప్లాట్లను లాగేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. మాజీ మంత్రి జోగి రమేష్, మహదేవ్ హరి, కార్పొరేటర్ మహదేవ్ అప్పాజీ వెనుక ఉండి వ్యవహారాన్ని నడిపిస్తున్నారని ఆరోపించారు. ప్లాట్లలో ఇల్లు నిర్మాణాలు చేసుకునేటప్పుడు బెదిరింపులకు పాల్పడ్డారని తెలిపారు. అంగబలం, అర్థబలం, రాజకీయ బలం లేదని మా ఆస్తులు లాగేసుకోవాలని చూస్తున్నారని, న్యాయపోరాటం కూడా చేయకుండా అడ్డంకులు కల్పిస్తున్నారని వారు వాపోయారు. ల్యాండ్ ఓనర్ సొసైటీ కుమ్మక్కై మమ్ములను రోడ్డున పడేయాలని చూస్తున్నారని మాకు న్యాయం జరగకపోతే 42 కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందని వాపోయారు

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *