ఆర్ఆర్ నగర్ ఆర్టీసీ సుబ్బారావు ప్లాట్స్ స్థలా యజమానులు గత 19 రోజులుగా చేస్తున్న నిరసన దీక్షకు సంఘీభావం తెలియజేసిన వైఎస్ఆర్సిపి నేత పోతిన వెంకట మహేష్.

0
0

విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఆర్ఆర్ నగర్ ఆర్టీసీ సుబ్బారావు ప్లాట్స్ స్థలా యజమానులు గత 19 రోజులుగా చేస్తున్న నిరసన దీక్షకు సంఘీభావం తెలియజేసిన వైఎస్ఆర్సిపి నేత పోతిన వెంకట మహేష్.

సునాయాసంగా డబ్బు సంపాదించాలని ,50 నుండి 60 కోట్ల రూపాయలు కొట్టేయాలని కొంతమంది కుమ్మక్కై 20 సంవత్సరాల కిందట కొనుగోలు చేసిన స్థలాలను అక్రమంగా కొట్టేయాలని స్థల యజమాని మజిద్ కుమ్మక్కై కుట్రజేసి శ్రీ లక్ష్మీ రామా కోఆపరేటివ్ సొసైటీ వ్యవస్థాపకులు ఆదిశేషు మరణించిన తరువాత ఆ సొసైటీని కొంతమంది ఆర్థిక నేరస్తులు చేజిక్కించుకొని స్థలాలు రిజిస్ట్రేషన్ జరిగిన 16 సంవత్సరాలు తర్వాత స్థల యజమానులకు ఇళ్ళ యజమానులకు తెలియకుండా కేసులు వేసినారు.

అనేక సంవత్సరాలుగా ఈ 46 మంది స్థల ఇళ్ల యజమానులు లో చాలామంది బిల్డింగ్ ప్లాన్లు తెచ్చుకొని ఇళ్ల నిర్మాణం కూడా చేసుకొని ఉన్నారు వీళ్ళులో చాలామంది ఎలక్ట్రిసిటీ బిల్ ,ఖాళీ నివేశన స్థలం పన్ను మరియు బ్యాంకు లోన్లు కూడా పొంది ఉన్నారు.

పేద సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు చెందిన ఈ స్థల ఇళ్ల యజమానులు పెద్ద స్థాయిలో డబ్బులు ఖర్చు పెట్టలేరని వీరిని సునాయాగా మోసం చేయవచ్చునని గ్రహించే ఈ కుట్రకు పాల్పడ్డారు అనిపిస్తుంది.

వీరికి మా శక్తి ఉన్నంతవరకు కచ్చితంగా అండగా నిలబడతాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here