3-8-2025
ఆరోగ్యానికి పెద్దపెట్టవేసేది చంద్రబాబునాయుడు ప్రభుత్వమే-MLA బొండా ఉమ
ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా పేదలను ఆదుకుంటున్న-MLA బొండా ఉమ
ధి :3-8-2025 ఆదివారం ఉదయం సింగ్ నగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నందు సెంట్రల్ నియోజకవర్గం లోని 27వ డివిజన్ కు చెందిన పల్లి మని ₹49,840 రూపాయలు, భూపతి వెంకట పద్మావతి ₹64270 రూపాయలు, చంద్రిక గోవిందా ₹46,280 రూపాయలు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు చేతన మీదగా అందజేయడం జరిగింది.
ఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ పేదలకు అన్ని రకాలైనటువంటి అధునాతనమైనటువంటి వైద్యం అందుబాటులోకి తీసుకురావడమే రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు లక్ష్యమని, అదేవిధంగా ప్రైవేట్ కార్పొరేట్ వైద్యశాలల్లో వేమల ఆరోగ్య నిమిత్తం వైద్యం చేపించి, సీఎం సహాయనిధి ద్వారా లబ్ధిదారులను ఆదుకుని వారికి ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నామని.
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి పేదలందరికీ ప్రభుత్వ దవాఖానాల ద్వారా అన్ని రకాలైనటువంటి వైద్యం చేపించడంతోపాటు సూపర్ స్పెషాలిటీ వైద్యం కూడా వారికి అందుబాటులోకి తీసుకొచ్చేటువంటి విధముగా, మెరుగైనటువంటి వైద్యం అందిస్తూ పూర్తిగా కృషి చేస్తున్నామని దానిలో భాగంగానే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి 27వ డివిజన్ బావజీపేటకు చెందినటువంటి జూపల్లి మనీ, దుర్గాపురంకు చెందినటువంటి, భూపతి పద్మావతి గోవింద్ లకు ఈనాడు సుమారుగా 1,80,000 చెక్కులను వారికి అందజేయడం జరిగిందని తెలిపారు.
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ప్రజల ఆరోగ్యం నిర్లక్ష్యం చేసినటువంటి ఫలితంగా ప్రైవేటు కార్పొరేట్ వైద్యానికి పేద వర్గాలను దూరం చేసినటువంటి ఫలితంగా అనేక రకాలుగా ఆరోగ్యం పాడయి మరణించినటువంటి సంగతిని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ విచారం వ్యక్తం చేశారు, ఆరోగ్య నిమిత్తం ఎవరు కూడా ఇబ్బందులు పడకుండా ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు తో మాట్లాడి (LOC ) చెక్కులను వైద్యులకు అందజేస్తున్నామని, మరికొన్ని వైద్యలకు సీఎం సహాయనిధి సీఎంఆర్ ఆదుకుంటున్నామని, నియోజకవర్గంలోని ప్రజలకు ఆరోగ్య నిమిత్తం ఇటువంటి సమస్య ఉన్న తమను సంప్రదించాలని ప్రజలకు సేవ చేయడమే ప్రధాన లక్ష్యమని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి డివిజన్ ఇంచార్జ్ నవలతం సాంబశివరావు, అధ్యక్షులు దాసరి జయరాజు, ప్రధాన కార్యదర్శి మల్లంపల్లి సురేష్, వర్ర్సు మస్తాన్, అలా తారక రామారావు తదితరులు పాల్గొన్నారు.