ఆపదలో ఆదుకుంటున్న ముఖ్యమంత్రి సహాయ నిధి : యార్లగడ్డ

Spread the love

ఆపదలో ఆదుకుంటున్న ముఖ్యమంత్రి సహాయ నిధి : యార్లగడ్డ
గన్నవరం :
పేద రోగులకు ఆపద కాలంలో ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతగానో తోడ్పాటు అందిస్తుందని ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పేర్కొన్నారు. గన్నవరం నియోజకవర్గంలోని పలువురు రోగులకు యార్లగడ్డ సిఫార్సు మేరకు మంజూరైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను శుక్రవారం రాత్రి గన్నవరంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో యార్లగడ్డ చేతుల మీదుగా రోగులకు అందజేశారు.
గన్నవరం మండలంలోని 5 గురికి 2.28 లక్షలు, విజయవాడ రూరల్ మండలంలోని ఇద్దరు రోగులకు రూ.1.14 లక్షలు, బాపులపాడు మండలం ఒకరికి రూ.24,400 మొత్తం 8 మందికి రూ.3.94లక్షల విలువ గల చెక్కులను పంపిణి చేసారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెంకట్రావ్ మాట్లాడుతూ ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న రోగులకు ముఖ్యమంత్రి సహాయనిది ద్వారా ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తులను వైద్య చికిత్స పొందిన ఆరు నెలల లోపు సమర్పించాలని సూచించారు. ఆరు నెలల గడువు దాటిన దరఖాస్తులను ఆన్లైన్లో అప్లోడ్ చేయటానికి సాధ్యపడదని తెలిపారు. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న రోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ గూడవల్లి నరసయ్య, టిడిపి నాయకులు ఆళ్ల గోపాలకృష్ణ, దయ్యాల రాజేశ్వరరావు, గోడపాటి తులసి మోహన్ , మేడేపల్లి రమ, గుజ్జర్లపూడి బాబురావు, జాస్తి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *