ఆటో కార్మిక సోదరులకు అండగా ఉంటాను, కార్మిక గొంతుగా తాను అసెంబ్లీలో మాట్లాడతాను,వారి సమస్యల పరిష్కారం కోసం పోరాడతాను -MLA బొండా ఉమ
పోలీసులు మరియు RTO అధికారులందరికీ తీవ్రమైన ఉల్లంఘనలు ఉంటే తప్ప కష్టం చేసుకునే ఆటో డ్రైవర్ల జోలికి వెళ్లవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం
గతంలో డ్రైవర్ల రక్తాన్ని పీల్చిన కొన్ని యూనియన్లు ధర్నాలకు, డబ్బుల వసూళ్లకు TNTUC లో స్థానం లేదు, మేము ₹100 రూపాయల పార్టీ సభ్యత్వం తీసుకుంటే, ₹5 లక్షల రూపాయల ప్రమాద బీమాను కవర్ చేసి, దురదృష్టవశాత్తు ఏదైనా కార్మికుడికి ప్రమాదం జరిగితే, ఈ 100 రూపాయల సభ్యత్వానికి 5 లక్షల రూపాయలు అందించే ఆబాధ్యతను మేమే తీసుకుంటాం -MLA బొండా ఉమ
ధి:22-11-2025 శనివారం ఈరోజు ఉదయం 10:00″గం లకు ” సింగ్ నగర్ లోని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు , ప్రభుత్వ విప్, నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు సమక్షంలో సెంట్రల్ నియోజకవర్గ TNTUC (తెలుగు నాడు ట్రేడ్ యూనియన్ కౌన్సిల్) అధ్యక్షులు గరిమెళ్ళ చిన్న ఆధ్వర్యంలో IFTU నుండి TNTUC లోకి 250 మంది ఆటో కార్మికులు తెలుగుదేశం పార్టీ TNTUC కండువా కప్పుకుని జాయిన్ అవ్వడం జరిగింది…
ఈ సందర్బంగా MLA బొండా ఉమామహేశ్వరరావు ఆటో కార్మికులకు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది…
ఈ సందర్బంగా బొండా ఉమ మాట్లాడుతూ:-ఈరోజు, వివిధ యూనియన్ల నుండి, ముఖ్యంగా IFTU నుండి ఆటో కార్మికులు మరియు యూనియన్ నాయకులు TNTUC లోకి చేరడం మాకు చాలా సంతోషాన్ని కలిగిస్తోంది అని, ఆటో కార్మిక సోదరులు ఈ తెలుగుదేశం ప్రభుత్వం యొక్క విధానాలు నచ్చి, తెలుగుదేశం పార్టీ లో చేరడం, పింగళి రమణ , ఆనంధ్, రాజు, నాగరాజు, సురేష్, శ్రీనివాస్, కోటి మరియు వారితో పాటు వచ్చిన 250 మంది సోదరులందరు ఈరోజు కార్మికుల పక్షాన నిలిచేది, వారి సమస్యల మీద స్పందించేది తెలుగుదేశం పార్టీయే అని…
గతంలో కార్మికులను చాలా చులకనగా చూసేవారు, వారి సమస్యలను పట్టించుకునేవారు కాదు అని, వారి సమస్యల పరిష్కారం కేవలం మాటలకే పరిమితమై ఉండేది, కానీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, ముఖ్యంగా తాను, ఆటో కార్మికులతో 25 సంవత్సరాలనుండి కలిసి ఉన్నందున, వారి పట్ల నాకు ప్రత్యేక అభిమానం, ప్రేమ ఉన్నాయి అని, ఆటో కార్మికులు ఏది చెప్పినా, ముఖ్యమంత్రి దృష్టికి మరియు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపించాను అని, నేడు సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులందరూ నాపై ఉన్న నమ్మకంతోనే ఇంత మంది ఆటో కార్మికులు పార్టీలో చేరడానికి వచ్చారు అని…
వారి సమస్యల పరిష్కారానికి నేను ఎల్లప్పుడూ చిత్తశుద్ధితో, వారి సోదరుడిగా అండగా ఉంటాను అని, కార్మికుల గొంతుగా తాను అసెంబ్లీలో మాట్లాడతాను, వారి సమస్యల పరిష్కారం కోసం పోరాడతాను అని, ప్రస్తుతం అధికారంలో ఉన్నందున, సంబంధిత అధికారుల దృష్టికి సమస్యలను తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తాం అని…
గతంలో జీవో నెంబర్ 8ని రద్దు చేశాం, అలాగే జీవో నెంబర్ 21ని రద్దు చేయడానికి కృషి కూడా పొందుపరిచాం అని, దీనిపై ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోంది. కొన్ని న్యాయపరమైన సమస్యలు ఉన్నందున, వాటిని పరిష్కరించి ఆంధ్రప్రదేశ్‌లో అమలు కాకుండా ఆ జీవోను రద్దు చేయడానికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నాం అని…
అదేవిధంగా, పోలీసులు మరియు RTO అధికారులందరికీ తీవ్రమైన ఉల్లంఘనలు ఉంటే తప్ప ఆటో డ్రైవర్ల జోలికి వెళ్లవద్దని చెప్పాం అని, చిన్న చిన్న పొరపాట్లకు వారిని వేధించవద్దని కూడా అధికారులకు తెలియజేశామని…
ఆటో డ్రైవర్లందరికీ మేము అండగా ఉంటాం, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం అని, గతంలో ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఇబ్బందుల్లో ఉన్న వారికి, ఆటో డ్రైవర్లందరికీ ఆటో డ్రైవర్ల సేవలో పథకం ద్వారా ₹15,000 రూపాయలు అందించాం అని, గత ప్రభుత్వంలో కొంతమందికి ₹10,000 రూపాయలు ఇచ్చేవారు, అయితే గత ప్రభుత్వం అమలు చేసిన మ్యాపింగ్ విధానం వల్ల 15-20 శాతం మందికి ఈ సహాయం ఆగిపోయింది అని, ఆగిపోయిన వారికి కూడా సహాయం అందించాలని NDA ప్రభుత్వం ఆలోచిస్తోంది, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గ్రీన్ టాక్స్‌ను తగ్గించాం, అలాగే రోడ్ టాక్స్‌ను కూడా తొలగించాం అని…
ఇంకా ఆటో కార్మికులకు ఏ సమస్యలు ఉన్నా, వాటిని జవాబుదారీతనంతో పరిష్కరించడానికి చిత్తశుద్ధితో కృషి చేస్తాం అని, గతంలో డ్రైవర్ల రక్తాన్ని పీల్చిన కొన్ని ధర్నాలకు, డబ్బుల వసూళ్లకు TNTUC లో స్థానం లేదు, మేము 100 రూపాయల సభ్యత్వం తీసుకుంటున్నాం, ఈ 100 రూపాయల సభ్యత్వానికి 5 లక్షల రూపాయల ప్రమాద బీమాను కవర్ చేస్తున్నాం. దురదృష్టవశాత్తు ఏదైనా కార్మికుడికి ప్రమాదం జరిగితే, ఈ 100 రూపాయల సభ్యత్వానికి 5 లక్షల రూపాయలు అందిస్తాం. ఆ బాధ్యతను మేమే తీసుకుంటాం అని, ఈరోజు పార్టీలో చేరిన నాయకులందరినీ తెలుగుదేశం పార్టీలోకి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం అని తెలియజేసారు…
ఈ కార్యక్రమంలో:- TNTUC వందలాదిమంది ఆటో కార్మికులు పాల్గొన్నారు…
22-11-2025

![]()