ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ శ్రీ విజయ ప్రతాపరెడ్డి ఎన్టీఆర్ జిల్లాలోని 5 అంబేద్కర్ గురుకులాలను 17,18 తేదీలలో

Spread the love

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ శ్రీ విజయ ప్రతాపరెడ్డి ఎన్టీఆర్ జిల్లాలోని 5 అంబేద్కర్ గురుకులాలను 17,18 తేదీలలో , ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా అంబేద్కర్ గురుకులాల్లో విద్యార్థులకు అందుతున్న భోజన నాణ్యత, వంటకు ఉపయోగించే సరుకుల నాణ్యత, పరిమాణం, స్వయంగా పరిశీలించారు. ఆయా అంబేద్కర్ గురుకులాల్లో విద్యార్థులతో పాటు భోజనం చేయడం జరిగింది . వివిధ రకాల బోజన మెనూ కు ఉపయోగించే సరుకుల వాటి నాణ్యతను, ఎక్స్పైరీ డేట్స్ ను ఆహార నాణ్యత అధికారులతో పాటు స్వయంగా పరిశీలించడం జరిగింది . స్వయంగా విద్యార్థులతో మాట్లాడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకులాలు లో అందిస్తున్న రోజువారి మెనూ ఆహార నాణ్యత సరిగా అందుతున్నాయా లేదా అని విద్యార్థుల ద్వారా అడిగి తెలుసుకున్నారు మొదటగా జి. కొండూరు మండలంలోని కుంటముక్కల గురుకులాన్ని తిరువూరులోని అంబేద్కర్ గురుకులాన్ని, ఏ కొండూరు మండలం కృష్ణారావు పాలెం గురుకులాన్ని , చందర్లపాడు మండలం ముప్పాళ్ళ గురుకులాన్ని జగ్గయ్యపేట మండలం జగ్గయ్యపేట గురుకులాన్ని తనిఖీ చేయడం జరిగింది . అన్ని పరిశీలించిన తర్వాత గౌరవ ఫుడ్ కమిషన్ చైర్మన్ ఆయా అంబేద్కర్ గురుకులాలలో విద్యార్థులకు అందిస్తున్న భోజన నాణ్యత పై పూర్తి సంతృప్తిని తెలియచేశారు. మరియు విద్యార్థులకు అందిస్తున్న సౌకర్యాలు మెనూ పట్ల , సౌకర్యాల పట్ల సంతృప్తిని వ్యక్తపరిచారు. ఇందుకు తోడ్పడుతున్న ఆయా గురుకులాల ప్రిన్సిపాల్ ను సిబ్బందిని ని అభినందించడం జరిగింది. ఈ సందర్భంగా ఆంద్ర ప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ జిల్లా కో సమన్వయాధికారి , అంగడి మురళీ కృష్ణ , NTR జిల్లా DEO , జిల్లా పౌర సరఫరా అధికారి, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ డీడీ, జిల్లా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ కి కూడా చైర్మన్ తో పాటు వున్నారు.

Loading