ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ గా డా. నూకసాని బాలాజీ బాధ్యతలు స్వీకరించారు

Spread the love

 శనివారం విజయవాడ, ఆటోనగర్ లోని ఏపీ టీడీసీ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ గా  డా. నూకసాని బాలాజీ బాధ్యతలు స్వీకరించారు

. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్గనిర్దేశనానికి అనుగుణంగా రాష్ట్రాన్ని పర్యాటక రంగంలో నెంబర్ వన్ గా నిలిపేందుకు శాయశక్తులా కృషి చేస్తానని తెలిపారు. తనపై ఎంతో విశ్వాసంతో బాధ్యతలు అప్పగించారని వారి ఆలోచనలకు అనుగుణంగా కార్పొరేషన్ అభివృద్ధికి కృషి చేయనున్నట్లు తెలిపారు. గత ఐదేళ్ల కాలంలో రాష్ట్రంలో టూరిజం రంగం నిర్లక్ష్యానికి గురైందని ఈ రంగం అభివృద్ధికి కృషి చేయన్నట్లు తెలిపారు. కేరళ, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో పర్యాటక రంగం కొత్త పుంతలు తొక్కుతోందని .. వీటన్నింటినీ అధ్యయనం చేసి రాష్ట్రాన్ని పర్యాటకం పరంగా అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు.*

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *