ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ తో విజయవాడలోని క్యాంప్ కార్యాలయంలో ప్రారంభమైన తెలుగు సినీ నిర్మాతల సమావేశం.

Spread the love

 24-6_2024

విజయవాడ

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి 

కొణిదల పవన్ కళ్యాణ్ తో విజయవాడలోని క్యాంప్ కార్యాలయంలో ప్రారంభమైన తెలుగు సినీ నిర్మాతల సమావేశం. 

 తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు, రాష్ట్రంలో సినిమా రంగం అభివృద్ధికి ఉన్న అవకాశాలు, రాష్ట్రంలో సినీ రంగం విస్తరణకు ఉన్న అవకాశాలపై చర్చించనున్నారు.

సినీ పరిశ్రమ ఇబ్బందులను పవన్ కళ్యాణ్ కి నివేదించనున్నారు. 

 ఈ సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ .

ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ తో సమావేశానికి హాజరైన నిర్మాతలు అల్లు అరవింద్, సి అశ్వినీదత్, ఏ.ఎం. రత్నం, ఎస్.రాధాకృష్ణ (చినబాబు), దిల్ రాజు, బోగవల్లి ప్రసాద్, డి.వి.వి.దానయ్య , సుప్రియ, ఎన్.వి.ప్రసాద్, బన్నీ వాసు, నవీన్ ఎర్నేని, నాగవంశీ, టి.జి.విశ్వప్రసాద్, వంశీ కృష్ణ తదితరులు ఉన్నారు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *