అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలి విజయవాడ నగర కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి గొట్టుపల్లి రేణు నాగ ఉమామహేశ్వరరావు

Spread the love

 అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలి

విజయవాడ నగర కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి

గొట్టుపల్లి రేణు నాగ ఉమామహేశ్వరరావు

విజయవాడ, జూన్ 28: తేదీ 28-06-2024 అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలి అని విజయవాడ నగర కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి గొట్టుపల్లి రేణు నాగ ఉమామహేశ్వరరావు తెలిపారు. రాష్ట్రంలో ఉన్న సుమారు పది లక్షల కుటుంబాలు రేషన్ కార్డులు లేకుండా ఉన్నాయి అని వారు అర్హులైనప్పటికీ ఎన్నో ప్రభుత్వ పథకాలకు నోచుకోకుండా పోతున్నారు. గత పది సంవత్సరాలుగా అర్హులకు కార్డులు ఇవ్వకుండా కాలయాపన చేస్తూ బీదలకు అన్యాయం చేయడం జరుగుతున్నది అని గొట్టుపల్లి రేణు నాగ ఉమామహేశ్వరరావు అన్నారు. అటు గత పాలకులు వైయస్సార్ ప్రభుత్వము ఇప్పుడు ఏలుతున్న ఎన్.డి.ఏ ప్రభుత్వము *రేషన్ కార్డులు* ఇవ్వకుండా ప్రజలను విస్మరించడం జరుగుతున్నది అని ఇట్టి అంశాన్ని ప్రజలంతా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని కాంగ్రెస్ పార్టీ విజయవాడ నగర ప్రధాన కార్యదర్శి గొట్టుపల్లి రేణు నాగ ఉమామహేశ్వరరావు కోరారు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *