అరాచక పాలనకు చరమగీతం పాడాలి సుజనా చౌదరి

4
0

 అరాచక పాలనకు చరమగీతం పాడాలి సుజనా చౌదరి 

అమరావతిని ఉక్కు పాదంతో అణిచివేసి రాజధాని లేని రాష్ట్రంగా మార్చిన వైసిపి అరాచక పాలనకు ప్రజలందరూ చరమగీతం పాడాలని పశ్చిమ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం సాయంత్రం 37వ డివిజన్ టిడిపి అధ్యక్షులు పిళ్లా సుదర్శన్ టిడిపి డివిజన్ మహిళా అధ్యక్షురాలు మెండి జ్యోతి బిజెపి మండల అధ్యక్షులు నాళం ఠాకూర్ లతో కలిసి వన్ టౌన్ జెండా చెట్టు గాంధీ బొమ్మ అప్పారావు వీధి సామారంగం చౌక్ రమణయ్య కూల్ డ్రింక్ షాప్ తదితర ప్రాంతాల్లో పర్యటించారు. అమరావతి రాజధాని రైతు ఐక్య కార్యచరణ కమిటీ జేఏసీ నాయకులు అమరావతి మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. సుజనా చౌదరి మాట్లాడుతూ వైసిపి ఐదేళ్ల అరాచక పాలనకు చరమగీతం పాడేందుకు ఏపీ ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారన్నారు. అమరావతిని అంగుళం కూడా కదలనివ్వమని ఏపీ రాజధానిగా అమరావతి ఉంటుందని స్పష్టం చేశారు రాజధానిని అభివృద్ధి చేసి సంపద సృష్టించి ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తామన్నారు. నియోజవర్గంలోని ముస్లిం మైనారిటీలకు అండగా ఉంటూ అన్ని వర్గాల ప్రజలకు వెన్నుదన్నుగా నిలుస్తానన్నారు. నియోజవర్గంలో ఎక్కడికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని వారు చూపించే ప్రేమాభిమానాలు ఆదరణ మరిచిపోలేనివని అన్నారు. ప్రత్యర్థుల విమర్శలను పట్టించుకోనని పార్టీలకతీతంగా అందరి అభిమానాన్ని చూరగొని భారీ మెజారిటీతో విజయం సాధిస్తానన్నారు. సుజనాకు మద్దతుగా మాజీ శాసనమండలి సభ్యులు బుద్ధ వెంకన్న టిడిపి అధికార ప్రతినిధి నాగుల్ మీరా ఎన్టీఆర్ జిల్లా బిజెపి అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ బిజెపి డివిజన్ కన్వీనర్ పొట్టి శ్రీహరి మాజీ బీజేపీ కార్పొరేటర్ ఉత్తమ్ చంద్ బండారి జనసేన డివిజన్ అధ్యక్షులు గన్ను శంకర్ గుండి జితేంద్ర పోలిశెట్టి శివ టిడిపి డివిజన్ యూనిట్ ఇన్చార్జ్ అడ్డూరి లక్ష్మి బిజెపి టిడిపి జనసేన నాయకులు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here