25-6-2025
అరాచక ఆగడాలకు చిరునామా అయిన కోసూరి మణి ని నగరంలో శాంతిభద్రతలు ఉండేటువంటి విధంగా నగర బహిష్కరణ చేయాలి
నగర పోలీస్ కమిషనర్ కోసూరి మణి కాల్ మనీ వ్యాపారాలపై, 81 భవనాలపై అతని పేరుపై ఉన్న లాడ్జిలలో భవనాలలో వ్యభిచారం నిర్వహిస్తున్న వాటిని అన్నింటిని స్వాధీన పరుచుకోవాలి
పోలీస్ వారు కఠినమైనటువంటి సెక్షన్లు పెట్టి కోసూరు మణి కి శిక్షపడేలా ఆడపిల్లలకు రక్షణ కల్పించేలా తక్షణమే చర్యలు చేపట్టాలి
గత వైయస్సార్ జగన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో కోసూరి మణి సాగించిన ఆర్థిక అరాచకాలపై విచారణ జరిపి ఆస్తులను స్వాధీన పరుచుకోవాలి, శాంతియుత నిరసన ఆందోళనలో జగన్ రెడ్డి చేతుల మీదగా వైయస్సార్సీపి జాయిన్ అయినా ఆనాడు అతను సాగించిన ఫోటోల ప్రతులను మహిళలు అందరూ దగ్ధం
ధి:-25-6-2025 బుధవారం సాయంత్రం 5:00″గం లకు ” విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం పరిధిలోని 25వ డివిజన్ దుర్గా అగ్రహారం గోరీల దొడ్డి వెనకమాల ఉన్నటువంటి వివిధ లాడ్జిలలో వ్యభిచార వృత్తిని చేయిస్తున్న వైయస్సార్సీపీ నాయకుడు కోసూరి సుబ్రహ్మణ్యం (మణి) ఇంటి ఎదుట ప్రజా సంఘాల నాయకులు ముఖ్యముగా మహిళలు పెద్ద ఎత్తున శాంతియుతంగా నిరసన ఆందోళన చేసి పేద మహిళలను, పేద విద్యార్థులకు డబ్బు ఎరచూపి వివిధ రూపాలలో బ్లాక్ మెయిల్ చేసి వ్యభిచార వృత్తిలో బలవంతముగా దించి వారితో వ్యభిచారం చేపిస్తూ గవర్నర్ పేట లోని సొంత లాడ్జి అయిన హోటల్ శ్రీ సాయి మణి లో వ్యభిచారం చేపిస్తూ రెడ్ హ్యాండెడ్ గా పోలీసులకు దొరికినటువంటి సందర్భంలో అతని మీద కఠినమైన సెక్షన్లు పెట్టి న్యాయస్థానంలో శిక్ష పడే విధముగా చేయాలని, ఇటువంటి అరాచకాలు చేస్తున్న అనేక కేసులలో ముద్దాయి అయినా కోసూరి మనీని భవిష్యత్తులో విజయవాడ నగరంలో ఉండకుండా నగర బహిష్కరణ చేయాలని పోలీస్ కమిషనర్ను ఈ సందర్భంగా ప్రజాసంఘాల నేతలు కోరారు…
ఈ సందర్భంగా బీసీ నాయకులు మాచర్ల గోపి, SC సెల్ మహిళా నాయకురాలు మద్దాల రుక్మిణి, మాట్లాడుతూ :- కోసూరి సుబ్రహ్మణ్యం (మణి) గతంలోనే అనేక రూపాలలో వివిధ కేసులు ఉన్నాయని, ఆనాడు కాల్ మనీ వ్యాపారంలో పెద్ద ఎత్తున పోలీసువారికి అనేకమంది మహిళలు కంప్లైంట్ ఇచ్చిన సందర్భంగా వారు విచారించి ఇతనిపై చాలా కేసులు పెట్టినటువంటి సందర్భంలో కోసూరి సుబ్రహ్మణ్యం ని నగర బహిష్కరణ చేయాలని ఆనాడే పోలీసు వారు నిర్ణయించగా అతనికి ఉన్నటువంటి పలుకుబడితో నగర బహిష్కరణ నుంచి తప్పించుకున్నారని, నేడు కాల్ మనీ వ్యాపారంతో ₹100 ల కోట్ల రూపాయలు సంపాదించి ఒక్క విజయవాడ నగరంలోని 81 భవనాలు అతని ఆస్తిగా ఉంది లక్షలాది రూపాయలు నెలకు అద్దెల రూపంలో వస్తున్నాయని, కోట్లాది రూపాయలతో కాల్ మనీ వ్యాపారం చేస్తూ పేద బడుగు వర్గాలను మొదలుకొని వివిధ వ్యాపారాలు చేస్తున్న బడా వ్యాపారుల వరకు ఖాళీ చెక్కులు, ప్రాముసరి నోట్లు, వారి దస్తావేదులు కాళీ స్టాంప్ పేపర్లు పెట్టుకొని అనేకమంది ఆస్తులు కాజేసినటువంటి నీచ చరిత్ర అతనిది అని, ఆ వివరాలు అన్నీ తెలియజేశారు…
ఇప్పుడు అతని సొంత బిల్డింగులో అతని పేరు మీదే ఉన్న హోటల్ శ్రీ సాయి మణి లో ఉత్తర ప్రదేశ్, ఝార్ఖండ్, ఉత్తరాంచల్, పశ్చిమబెంగాల్ మహిళలను డబ్బు ఎర్రను చూపి నగరానికి తీసుకొని వచ్చి, అతని లాడ్జిలోనే కాకుండా అతనికి ఉన్నటువంటి భవనాలలో కూడా వ్యభిచార వృత్తిని చేయించడమే కాకుండా నగరంలో వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులను మహిళ హాస్టల్స్లో ఉన్నటువంటి వారికి డబ్బును ఎరగా చూపి వారితో కూడా వ్యభిచారం చేపించినటువంటి ఘటనాలు దొరికినటువంటి సంఘటన వివరాలను తెలిపారు…
గత వైయస్సార్సీపి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆనాటి మంత్రి అప్పటి స్థానిక శాసనసభ్యులు జిల్లా అధ్యక్షుడు అండతో వ్యభిచారం, కాల్ మనీ, పేద వర్గాలను దోపిడీ చేయడం ఆస్తులను స్వాధీన పరుచుకోవడం ఆరోజు అధికార మతంతో అనేక రకాలు అయినటువంటి వ్యాపారాలు చేయడమే కాకుండా చివరకు బ్యాంకులకు కూడా రుణాలు ఇచ్చినటువంటి ఆర్థిక బలవంతుడు కోట్లాది రూపాయలు ప్రజా ఆస్తులను దోపిడీ చేసిన చరిత్ర అతనిది అని అన్నారు
కోసూరు మనీని అరెస్టు చేయడమే కాకుండా అతనిపైన అతని చరిత్రను దృష్టిలో పెట్టుకొని బలమైనటువంటి కేసులను పెట్టి న్యాయస్థానంలో శిక్ష పడేటట్టు చేయడంతోపాటు ఈలోపు నగర ప్రజలను వడ్డీల రూపంలో, దోపిడీల రూపంలో,అరాచకాల రూపంలో వ్యవహరించకుండా ఉండేందుకు అతనిని నగర బహిష్కరణ చేయాలని మాచర్ల గోపి మద్దాల రుక్మిణి పోలీస్ కమిషనర్ని కోరారు
తాళ్లూరి మఠం భాగ్యలక్ష్మి (మేరీ ) మాట్లాడుతూ:- తనను గతంలో ఉద్యోగాలు ఇప్పిస్తామని లక్షలాది రూపాయలు తీసుకొని, ఉద్యోగాలు ఇప్పించకపోగా డబ్బులు తిరిగి ఇవ్వకపోగా మద్యం మత్తులో అనేకమార్లు అర్ధరాత్రి ఫోన్ చేసి మహిళను అని కూడా చూడకుండా అనేక పద్ధతులలో మాటలతో తనను లోబరుచుకునే విధముగా మాట్లాడటమే కాకుండా పలుమార్లు నీతో మాట్లాడాలి నేను చెప్పినటువంటి రూముకు వస్తే తిరిగి నీ డబ్బులు ఇస్తా ఉద్యోగాలు ఇప్పిస్తాను అని ఆనాడు వైయస్సార్సీపి ప్రభుత్వ అండతో నన్ను మానసికంగా శారీరకంగా ఇబ్బందులకు గురి చేయడమే కాకుండా కులం పేరుతో కూడా తిట్టినటువంటి విషయాన్ని, తనమీద దాడి చేసినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెబుతూ విజయవాడ సూర్యారావుపేటలోని పోలీస్ స్టేషన్లో తను కేసు పెట్టి FIR కట్టించి ఏసీపీ స్థాయిలో విచారణ జరిపి నిజమేనని నిర్ధారించినటువంటి విషయాన్ని కూడా ఈ శాంతియుతమైన నిరసన ఆందోళనలో మీడియా వారికి ఆ ప్రాంత ప్రజల సమక్షంలో తెలియజేసిడం జరిగింది…
ఈ కార్యక్రమంలో:- మాచర్ల పావని, ఇనుకుల సాయిబాబు, సుబ్బారావు, బెజ్జం జైపాల్, ఇప్పిలి రామ్మోహన్, రాము, లక్ష్మణ, గులివెందుల లీల, దొంగర ఆంజనేయులు, సీతామహాలక్ష్మి, బేవర దుర్గారావు, బెజవాడ తిరుపతి, దాసరి జయరాజు, మల్లంపల్లి సురేష్, డి మార్ట్ రవణమ్మ, వరలక్ష్మి, రమణమ్మ, కొండపల్లి రూప్ కుమార్, సుబ్రహ్మణ్యం, కాశీ, లక్ష్మణ్ సింగ్, శ్రీను, సరోజినీ, శృతి, సాంబశివరావు, డోలా జనార్ధన్, Ch రఘు, చలమల శెట్టి శ్రీనివాసరావు, గీత దుర్గా, ఉండి కృష్ణ, ఉట్టి శ్రీనివాస్, బాలాజీ, సత్తి సాయి, గిరి, లలిత్, చలమల శెట్టి శైలజ, తదితరులు పాల్గొన్నారు