అమ్మ‌వారి అనుగ్ర‌హం ప్ర‌జ‌లంద‌రిపై వుండాలి : ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని)

Spread the love

 అమ్మ‌వారి అనుగ్ర‌హం ప్ర‌జ‌లంద‌రిపై వుండాలి : ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) 

తిరువూరు : రాష్ట్రంలోని ప్ర‌జ‌లంద‌రూ ఆ అమ్మ‌వారి అనుగ్ర‌హం, క‌రుణాకటాక్ష‌ల తో సుభిక్షంగా వుండాల‌ని ఎంపి కేశినేని శివ‌నాథ్ కోరుకున్నారు. తిరువూరు ప‌ట్టణంలోని కూర‌గాయల మార్కెట్ సెంట‌ర్ నందు ద‌స‌రా శ‌ర‌న్న‌వ‌రాత్రుల సంద‌ర్బంగా ఏర్పాటు చేసిన అమ్మ‌వారి మండ‌పాన్ని ఎమ్మెల్యే కొలిక‌పూడి శ్రీనివాస‌రావుతో క‌లిసి ద‌ర్శించుకున్నారు. ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించి తీర్ధ ప్ర‌సాదాలు అందుకున్నారు.

మండ‌ప నిర్వ‌హ‌కులు ఎంపి కేశినేని శివ‌నాథ్, ఎమ్మెల్యే కొలిక‌పూడి శ్రీనివాస‌రావు లను ఘనంగా శాలువాతో స‌త్క‌రించారు. ఈ కార్య‌క్ర‌మంలో తిరువూరు నియోజ‌క‌వ‌ర్గ ప‌రిశీల‌కులు చిట్టిబాబు, టిడిపి నాయ‌కులు గోదా రాజ‌శేఖ‌ర్, నాళ్ల సురేంద్ర‌, బుజ్జి, హుస్సెన్, శ్రీకాంత్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *