అభివృద్ధి, సంక్షేమంతోనే జగన్ కు బుద్ధి చెబుతాం 3వ డివిజన్ లో రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గద్దె రామమోహన్

Spread the love

 అభివృద్ధి, సంక్షేమంతోనే జగన్ కు బుద్ధి చెబుతాం

3వ డివిజన్ లో రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గద్దె రామమోహన్

నారా చంద్రబాబునాయుడు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ఆలోచనలు చేస్తున్నారని, జగన్మోహన్రెడ్డి మాత్రం ప్రజలకు అబద్ధాలను ప్రచారం చేసి మభ్యపెట్టాలని చూస్తున్నారని ఎమ్మెల్యే గద్దె రామమోహన్ అన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథకంలో పరుగులు పెట్టించడమే కాకుండా సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేసి జగన్ కు సరైన బుద్ధి చెబుతామని అన్నారు. 

           తూర్పు నియోజకవర్గ పరిధిలోని 3వ డివిజన్ కనకదుర్గా నగర్లో నాలుగు రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమం శనివారం జరిగింది. కనకదుర్గా నగర్ కాలనీ గణేష్ రోడ్డు, నగర కాలనీ 1, 9, 13 రోడ్ల సుమారు రూ.80 లక్షలతో చేపటిన నిర్మాణ పనులకు ఎమ్మెల్యే గద్దె రామమోహన్ హజరై భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు.

              ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామమోహన్ మాట్లాడుతూ భూగర్భ డ్రైనేజీ సౌకర్యాన్ని పూర్తి స్థాయిలో మరమ్మత్తులు చేసుకోవాలని చెప్పారు. గత ఐదు సంవత్సరాల కాలంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం భూగర్భ డ్రైనేజీ సౌకర్యాన్ని ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. విద్యార్థులు, పాదచారులు సైతం ఈ మురుగునీటిలో నుంచే రాకపోకలు సాగించడం వల్ల డ్రైనేజీ వ్యర్థాలు వారి కాళ్ళకు అంటుకుంటున్నాయని చెప్పారు. నగరంలోని భూగర్భ డ్రైనేజీ సౌకర్యాన్ని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలనే విషయాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్ళామని చెప్పారు. నగరంలోని సమస్యలపై టీడీపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి పరిష్కరిస్తుందన్నారు.

సైబర్ మోసాలపై నగర ప్రజలు పూర్తి స్థాయిలో అవగాహన ఉండాలని అప్పుడే సైబర్ నేరాలను అరికట్టగలమని చెప్పారు. చదువు లేని వారితో పాటుగా చదువుకున్న వారు సైతం సైబర్ మోసాలకు గురి అవుతున్నారని చెప్పారు. సైబర్ మోసాలకు గురికాకుండా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. మొబైల్ ఫోన్కు వచ్చే నకిలీ ఫోన్ కాల్స్, మేసేజ్లను నమ్మవద్దని అన్నారు. అదేవిధంగా గంజాయికి కూడా యువత దూరంగా ఉండాలని చెప్పారు. మత్తు పదార్థాలతో జీవితం సర్వనాశనం అవుతుందని అన్నారు. టీడీపీ ప్రభుత్వంలో 39 మంది హత్యకు గురయ్యారని వైఎస్.జగన్మోహన్రెడ్డి చెబుతున్నారని, వారి పేర్లు ఇవ్వాలని అడుగుతుంటే జగన్మోహన్రెడ్డి పరుగులు పెడుతున్నాడని అన్నారు. అబద్ధాలను ప్రచారం చేసి ప్రజలను మభ్యపెట్టడానికి జగన్ ప్రయత్నిస్తున్నాడని చెప్పారు. గంజాయి నుంచి ప్రజలను ఏవిధంగా కాపాడాలి, యువతకు ఉద్యోగాలు ఎలా కల్పించాలి, రాష్ట్రంలో సంక్షేమ పథకాలను ఎలా అమలు చేయాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి ఎలా చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనలు చేస్తున్నాడని, జగన్ మాత్రం అబద్ధాలు ప్రచారం చేసి ప్రజలను మభ్య పెట్టడానికి చూస్తున్నాడని చెప్పారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి జగన్కు సరైన సమాధానాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చూపిస్తారని అన్నారు.

కాలనీ అధ్యక్షుడు యలమందరావు మాట్లాడుతూ గతంలో ఈ కాలనీలో రోడ్లపై నడుము లోతు వర్షం నీరు నిల్వ ఉండేవని అన్నారు. ఏ సౌకర్యాలు లేని కాలనీలో ఇప్పుడు అన్ని సౌకర్యాలను కల్పించుకున్నామని చెప్పారు. కాలనీలో సమస్యలు పరిష్కారం అయ్యాయని అంటే అది ఎమ్మెల్యే గద్దె రామమోహన్ వల్లనేనని అన్నారు.

ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు తాడి బాబూరావు, ముమ్మనేని ప్రసాద్, గుత్తికొండ కృష్ణమోహన్, గద్దె రమేష్, యలమంచిలి పండు, గొల్లపల్లి నారాయణరావు, ఇంద్రకుమార్, వంగల కృష్ణప్రసాద్, ఈశ్వర్ పేరేపి, మాధవ్, జాస్తి శ్రీనివాసరావు, సుబ్బారావు, అడపా శివనాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *