మహమ్మద్ అబ్దుల్ షరీఫ్ ను సత్కరించిన ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్..
శాసనమండలి మాజీ చైర్మన్ ,
ఏపీ మైనార్టీ అఫైర్స్ అడ్వైజర్ మహమ్మద్ అబ్దుల్ షరీఫ్ ను పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ శాలువాతో సత్కరించారు.
అబ్దుల్ షరీఫ్ పశ్చిమ నియోజకవర్గం లోని ప్రభుత్వ ఉర్దూ జూనియర్ కళాశాల, ఐరన్ యార్డు ప్రాంతంలోని గురుకుల పాఠశాలలను మంగళవారం పరిశీలించారు..
విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యాభివృద్ధికై, కళాశాల అభివృద్ధికి తీసుకోవాల్సిన నిర్ణయాలను ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్ హఫీజ్ షేక్ అహ్మద్ ను అడిగి తెలుసుకున్నారు.
పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ ఆహ్వానం మేరకు భవానిపురం లోని ఎన్డీఏ కార్యాలయానికి షరీఫ్ విచ్చేశారు .
ప్రత్తిపాటి శ్రీధర్ ఆయనను శాలువాతో సత్కరించారు.
పశ్చిమలో ఏడాదికాలంగా ఎమ్మెల్యే సుజనా చౌదరి అందిస్తున్న సేవలను ఆయన కొనియాడారు.
అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని అబ్దుల్ షరీఫ్ అన్నారు..
ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి
ఎస్ ఫిరోజ్ ,రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి ఎస్ ఎం ఫైజాన్,ఎన్టీఆర్ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి మీర్జా ముజఫర్ బేగ్ , కూటమి నేతలు మంగళపురి మహేష్, గడ్డిపాటి కిరణ్ దొడ్ల రాజా తదితరులు పాల్గొన్నారు.