అన్న క్యాంటీన్లకు విశ్రాంత అధ్యాపకురాలు రూ.5 లక్షల విరాళం

Spread the love

 *అమరావతి*

అన్న క్యాంటీన్లకు విశ్రాంత అధ్యాపకురాలు రూ.5 లక్షల విరాళం

పేదల ఆకలి బాధలు తీర్చుతున్న అన్న క్యాంటీన్లకు గుంటూరుకు చెందిన విశ్రాంత అధ్యాపకురాలు మేకా తులసమ్మ రూ.5 లక్షలు విరాళం ఇచ్చి గొప్ప మనసు చాటుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబును మంగళవారం ఆమె సచివాలయంలో కలిసి చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఆమెను అభినందించారు. గుంటూరు ప్రభుత్వ కళాశాలలో భౌతిక శాస్త్ర అధ్యాపకురాలిగా తులసమ్మ సుదీర్ఘ కాలం సేవలు అందించి ఉద్యోగ విరమణ చేశారు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *