అన్నే రామకృష్ణ భౌతిక కాయానికి మంత్రి కొల్లు రవీంద్ర అశ్రు నివాళి

Spread the love

 

విజయవాడ

15.07.2024

అన్నే రామకృష్ణ భౌతిక కాయానికి మంత్రి కొల్లు రవీంద్ర అశ్రు నివాళి

టీడీపీ గెలుపు కోసం అలుపెరుగక శ్రమించిన అన్నే రామకృష్ణ మరణం పార్టీకి తీరని లోటని రాష్ట్ర గనులు, భూగర్భ, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి గొల్లపూడిలోని నివాసానికి వచ్చారు రామకృష్ణ భౌతిక దేహానికి నివాళులర్పించారు. పూల మాల వేసి ఘన నివాళి తెలిపారు. టీడీపీ పోల్ మేనేజ్మెంట్ విభాగంలో అందించిన సేవల్ని కొనియాడారు. నిత్యం పార్టీ కోసం తపించే రామకృష్ణ లాని వ్యక్తి దూరం కావడం అత్యంత బాధాకరం అన్నారు. పార్టీ గెలుపు కోసం నిరంతరం శ్రమించి.. గెలుపు ఫలాలు ఆస్వాదించకుండా వెళ్లిపోవడం బాధగా ఉందన్నారు. రామకృష్ణ కుటుంబ సభ్యులను పరామర్శించారు. పార్టీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. రామకృష్ణ పవిత్ర ఆత్మకి భగవంతుడు శాంతి చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢమైన సానుభూతి ప్రకటించారు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *