
ఎన్టీఆర్ జిల్లా
: 20.11.2025
“అన్న”మమోఘం పరబ్రహ్మస్వరూపం..
పేదల ఆకలి తీర్చేందుకే అన్న క్యాంటీన్లు..
జిల్లా కలెక్టర్ డా. జి లక్ష్మీశ
అన్నం పరబ్రహ్మస్వరూపమని సృష్టిలో సర్వ ప్రాణులకు ఆహారం ఎంతో ముఖ్యమని పేదవాడి ఆకలి తీర్చేందుకు ఏర్పాటు చేసిన గౌరవ ముఖ్యమంత్రి సంకల్పానికి అనుగుణంగా అన్నార్తులకు ఆత్మీయత పంచే అన్న క్యాంటీన్లలో నిర్వహణ పరంగా ఎటువంటి లోటుపాట్లు లేకుండా నిరంతరం పర్యవేక్షిస్తున్నామని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ అన్నారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ల నిర్వహణ పరిశీలనలో భాగంగా గురువారం జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ పటమట హైస్కూల్ రోడ్డులోని అన్న క్యాంటీను సందర్శించి నిర్వహణను పరిశీలించారు.
ఈ సందర్భంగా అన్న క్యాంటీన్లో జిల్లా కలెక్టర్ లక్ష్మీశ 5 రూపాయలు చెల్లించి క్యూ లైన్లో అల్పాహారం తీసుకున్నారు. ఉదయం అల్పాహారం కోసం వచ్చిన వారితో కలిసి అల్పాహారం స్వీకరిస్తూ క్యాంటీన్లో అందించే ఆహార పదార్థాల నాణ్యత ఎలా ఉంది? రుచి సుచి లు ఎలా ఉన్నాయని అని అడిగి తెలుసుకున్నారు. ఆహార పదార్థాల పట్టిక, టోకెన్ కౌంటర్, డైనింగ్ ఏరియాతో పాటు సరఫరా చేస్తున్న తాగునీటిని పరిశీలించారు.
అనంతరం అన్న క్యాంటీన్ నిర్వహకులతో మాట్లాడుతూ అన్న క్యాంటీన్ ఏర్పాటు చేసిన సకల్పాన్ని దృష్టిలో పెట్టుకోవాలని క్యాంటీన్ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని, అపరిశుభ్రత అనేది మచ్చుకైనా కనిపించకూడదని సిబ్బందికి స్పష్టం చేశారు. మెనూ ప్రకారం ఆహార పదార్థాలను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఆకలితో ఉన్నవారికి పట్టెడన్నం పెట్టడంలో ఉన్న ఆనందం మరెక్కడా లభించదని, ఇలాంటి మంచి కార్యక్రమంలో పనిచేసే భాగ్యం కలగడం అదృష్టంగా భావించి నిబద్ధతతో సేవలందించాలని సూచించారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా క్యాంటీన్ ను నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. అన్న క్యాంటీన్ నిర్వహణలో ప్రజా అభిప్రాయం సేకరించేందుకు క్యూఆర్ కోడ్ను ఏర్పాటు చేయడం జరిగిందని ప్రజా అభిప్రాయాలను పరిగణంలోకి తీసుకుని మరింత సమర్థవంతంగా అన్న క్యాంటీన్లను నిర్వహించాలని కలెక్టర్ లక్ష్మీశ సూచించారు.
పరిశీలనలో నగర పాలక సంస్థ సిటి ప్లానర్ కె. సంజయ్, జోనల్ కమీషనర్ షమ్మి, హెల్త్ ఆఫీసర్ డా. గోపాల్ నాయక్, సిఇ సత్య కుమారి, ఎసిపి మోహన్ బాబు తదితరలు ఉన్నారు.
![]()
