08-08-2025
అట్టహసం గా ప్రారంభమైన ఎపిఎల్ సీజన్ -4
ముఖ్యఅతిథులు హాజరైన కేంద్ర విమానాయన శాఖ మంత్రి రామ్మోమన్ నాయుడు, హీరో వెంకటేష్
స్వాగతం పలికిన ఎసీఏ అధ్యక్షుడు ఎంపీ కేశినేని శివనాథ్
వైజాగ్ : ఆంధ్ర క్రికెట్ అస్సోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సీజన్ -4 శుక్రవారం సాయంత్రం ఏసీఏ – విడిసిఎ మైదానంలో అట్టహసం గా ప్రారంభమైంది. ప్రారంభోత్సవ వేడుకల్లో భాగంగా టాలీవుడ్ నటి ప్రగ్యా జైస్వాల్ నృత్య ప్రదర్శన , ఏపీఎల్ సీజన్ 4 ఎంథమ్ సాంగ్ రూపొందించిన మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ పాకాల సంగీత ప్రదర్శన ప్రేక్షకులకు అలరించాయి. ఈ వేడుకలో లేజర్, డ్రోన్ ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన కేంద్ర విమానయాన మంత్రి కె. రామ్మోహన్ నాయుడు, ఏపీఎల్ సీజన్ బ్రాండ్ అంబాసిడర్ వెంకటేష్ కి ఏసీఏ అధ్యక్షుడు కేశినేని శివనాథ్ స్వాగతం పలికారు.
ఈ ఎపీఎల్ సీజన్ 4 ప్రారంబోత్స వేడుకలకి టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎంపీ ఎమ్.శ్రీ భరత్ , బిజెపి రాష్ట్ర అద్యక్షుడు పి.మాధవ్ హాజరయ్యారు.
ఈ ఏపీఎల్ సీజన్ -4 ట్రోపి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఏపీఎల్ సీజన్ బ్రాండ్ అంబాసిడర్ వెంకటేష్, ఎపీఎల్ సీజన్ లో తలపడే ఏడు జట్లు టీమ్ కెప్టెన్స్ తో ట్రోపిని ఆవిష్కరించారు. అనంతరం ఏపీఎల్ సీజన్ 4 మొదటి మ్యాచ్ లో తలపడిన కాకినాడ కింగ్స్ వర్సెస్ అమరావతి రాయల్స్ జరిగిన మ్యాచ్ ను గ్యాలరీలో కూర్చొని వీక్షించారు. అలాగే ఏపీఎల్ సీజన్ ప్రారంభోత్సవ వేడుకలకి హాజరైన విద్యార్ధులకు స్నాక్స్, విందు ఏసీఏ అధ్యక్షుడు కేశినేని శివనాథ్, సెక్రటరీ సానా సతీష్ ఏర్పాటు చేశారు.
ఈ సందర్బంగా కేంద్ర విమానాయన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ విశాఖపట్నం వేదికగా ఎపిఎల్ సీజన్ -4 ప్రారంభం కావడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఏపీఎల్ లీగ్ సీజన్ 4 విశాఖపట్టణం వేదికగా కావటం చాలా సంతోషంగా వుందన్నారు. గతంలో జరిగిన వాటికంటే అనేక మార్పులను ఎపీఎల్ సీజన్ 4 లో తీసుకువచ్చామన్నారు. గత ప్రభుత్వం క్రికెట్ ను బంధించి స్థాయిలో వుంచితే, ప్రజలకు, ప్రేక్షకులకు, ముఖ్యంగా క్రీడాకారులకు క్రికెట్ ను అందించాలనే ఆలోచనతో అనేక మార్పులు తీసుకువచ్చి ఏపీఎల్ సీజన్ 4 తో రీ లాంచ్ చేయటం జరిగిందని అన్నారు.
ఏపీఎల్ సీజన్ 4 లో గెలుపు ఓటములు ముఖ్యం కాదు.. ఆంధ్ర లోని క్రికెట్ టాలెంట్ గెలవాలని ఆకాంక్షించారు. ఏపీఎల్ ద్వారా గ్రామీణ స్థాయిలో వున్న క్రీడాకారులు స్థాయిలో రాణిస్తున్నారని వైభవ్ సూర్య వంశీ లాంటి యువక్రీడాకారులు వచ్చారని, ఉత్తరాంధ్ర నుండి కూడా రావాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. భారత దేశంలో క్రీడాకారుల టాలెంట్ కు ఎక్కడ కొదవ లేదు కానీ వారికి అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని అలాంటి వారికి వేదిక గా ఏపీఎల్ సీజన్ 4 మారిందని అన్నారు.
అనంతరం ఏసీఏ అధ్యక్షుడు కేశినేని శివనాథ్ మాట్లాడుతూ ఏపీఎల్ సీజన్ 4 మ్యాచ్ లను భారీ ఎత్తున నిర్వహించబోతున్నామని, ఈ సంవత్సరం మొత్తం ఏడు జట్లు పాల్గొంటున్నాయని అన్నారు. గ్రామీణ స్థాయి నుంచి వచ్చిన ఆటగాళ్లను ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఏపీఎల్ సీజన్ -4 భారీ స్థాయిలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఏపీఎల్ సీజన్ 4 లో ఆడుతున్న క్రికెట్ ప్లేయర్స్ నితీష్ కుమార్ రెడ్డి లాగా విజయం సాధించాలని కోరుకున్నారు. ఇప్పటికే విశాఖ పట్నం వేదికగా రెండు ఐపీఎల్ మ్యాచ్‌లను నిర్వహించగా, విశాఖ మైదానాన్ని హోమ్ గ్రౌండ్‌గా ఎంచుకున్న ఢిల్లీ క్యాపీటల్స్ ఈ గ్రౌండ్ లో రెండు మ్యాచుల్లో విజయం సాధించిందన్నారు.
ఈ కార్యక్రమంలో విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు శ్రీ భరత్, విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు, రాజ్యసభ సభ్యులు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి సానా సతీష్, ఏపిఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ సుజయ్ కృష్ణ రంగారావు, గాజువాక శాసనసభ్యులు, టిడిపి రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్, మాజీ క్రికెటర్ ముండేశ్వరినాథ్ తదితరులు పాల్గొన్నారు.