అజిత్ సింగ్ నగర్ ఎస్ టి పి లలో మొక్కలు నాటిన అడిషనల్ కమిషనర్ ప్రాజెక్ట్స్ కె .వి సత్యవతి

Spread the love

పచ్చదనంతో వాయు కాలుష్యం నియంత్రణ

అజిత్ సింగ్ నగర్  ఎస్ టి పి లలో  మొక్కలు నాటిన అడిషనల్ కమిషనర్ ప్రాజెక్ట్స్ కె .వి సత్యవతి

 కాలుష్య నియంత్రణకు విజయవాడ నగర పాలక సంస్థ  తీసుకుంటున్న చర్యల్లో భాగంగా విజయవాడ నగరపాలక సంస్థ అడిషనల్ కమిషనర్ ప్రాజెక్ట్స్  కెవి సత్యవతి  బుధవారం ఉదయం అజిత్ సింగ్ నగర్ సివేజ్  ట్రీట్మెంట్ ప్లాంట్లో మొక్కలను నాటారు. 

 ఈ సందర్భంగా మాట్లాడుతూ విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న 36 డంపింగ్ స్టేషన్లో, ఏడు ఎస్టిపిలలో,  కార్బన్  ఉద్గారాలు తగ్గించి ప్రజలకు వాయువులో ఆక్సిజన్ శాతాన్ని పెంచి కార్బన్ డయాక్సైడ్  శాతాన్ని తగ్గించే దిశగా విజయవాడ నగరపాలక సంస్థ 1000 కి పైగా మొక్కలను నాటుతోందని,  మొక్కలను నాటడం ద్వారా ప్రజలకు స్వచ్ఛమైన గాలిని అందించడమే కాకుండా ఆరోగ్యకరమైన జీవితాని కల్పించవచ్చని, విజయవాడ నగర పరిధిలో ఉన్న ప్రతి సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ లోనే కాకుండా 36 డ్రైనేజీ పంపింగ్ స్టేషన్లో కూడా మొక్కలను నాటుతు , విజయవాడ నగరపాలక సంస్థ వాయు కాలుష్యాన్ని నియంత్రించే విధంగా అడుగులు ముందుకు వేస్తుందని, కాలుష్య రహితమైన సమాజాని కోసం విజయవాడ నగరపాలక సంస్థ ఎల్లప్పుడూ కృషి చేస్తుందని అన్నారు.

 ఈ కార్యక్రమంలో విజయవాడ నగరపాలక సంస్థ అడిషనల్ కమిషనర్ ప్రాజెక్ట్ కే వి సత్యవతి తో పాటు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ప్రాజెక్ట్స్ డివిజన్ వెంకటేశ్వర్ రెడ్డి, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఫణీంద్ర, తదితరులు పాల్గొన్నారు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *