అగ్ని ప్రమాద నిరోధక అవగాహన కార్యక్రమం నిర్వహించిన విఎంసి ఫైర్ ఆఫీసర్స్

4
0
 విజయవాడ నగరపాలక సంస్థ

01-03-2025

అగ్ని ప్రమాద నిరోధక అవగాహన కార్యక్రమం నిర్వహించిన విఎంసి ఫైర్ ఆఫీసర్స్

 విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు అగ్ని ప్రమాదాలను నిరోధించడానికి ఎన్టీఆర్ కాంప్లెక్స్ లో శనివారం ఉదయం, వ్యాపారం చేస్తున్న వ్యాపారస్తులకు, వారి సిబ్బందికి అవగాహన కార్యక్రమం కల్పించారు విఎంసి ఫైర్ సిబ్బంది

 ఈ కార్యక్రమంలో అగ్ని ప్రమాదం జరగకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన నిరోధక చర్యలు, అగ్ని ప్రమాద నిరోధక పరికరాలను ఉపయోగించు విధానము, అగ్ని ప్రమాదం జరిగినప్పుడు మంటలను ఎలా అర్పాలి, ఎటువంటి పరికరాలను ఉపయోగించాలి, ఫైర్ స్ప్రింక్లర్స్, స్మోక్ డిటెక్టర్స్, ఎక్కడెక్కడ అమర్చాలి, వాటి వలన స్మోక్ అలారం ఎలా వస్తుంది, అగ్ని ప్రమాదం జరగకుండా కాంప్లెక్స్ చుట్టూ ఫైర్ సేఫ్టీ మెజర్స్ ఏమేం ఉండాలి వంటి విషయాలపై వారికి అవగాహన కల్పించారు.

 ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ మాల్యాద్రి, స్టేషన్ ఫైర్ ఆఫీసర్ రాజా, ఎన్టీఆర్ కాంప్లెక్స్ వ్యాపారస్తులు, సిబ్బంది పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here