Home Andhra Pradesh అక్రమ ఆస్తులు, కేసులు పై కేశినేని నాని కి సవాల్ విసిరిన కేశినేని...

అక్రమ ఆస్తులు, కేసులు పై కేశినేని నాని కి సవాల్ విసిరిన కేశినేని శివనాథ్ చిన్ని

2
0

 విజయవాడ

అక్రమ ఆస్తులు, కేసులు పై కేశినేని నాని కి  సవాల్  విసిరిన కేశినేని శివనాథ్ చిన్ని

నీ అక్రమాలు నేను నిరూపిస్తా.దమ్ముంటే నా పై చేసిన ఆరోపణలు నిరూపించు

నోరు అదుపులో పెట్టుకో లేదంటే నీ అవినీతి, మోసాల చరిత్ర మొత్తం బయట పెడతా

కేశినేని శివనాథ్ చిన్ని కూటమి పార్టీల  విజయవాడ టిడిపి ఎంపి అభ్యర్థి

భవిష్యత్తు లో ఏం చేయబోతున్నాం, గతంలో ఏం చేశామో మేము చెబుతున్నాం

కేశినేని నాని మాత్రం మా పై విషం చిమ్మడమే పనిగా పెట్టుకున్నారు

కలల రాజధాని అమరావతి ని వైసిపి ప్రభుత్వం నాశనం చేసింది

ప్రజల ఆర్ధిక వనరులు దెబ్బ తీసి పొట్ట కొట్టారు

కేశినేని నాని పదేళ్లల్లో ప్రజలకు ఏం చేశారో  చెప్పలేరా

విజయవాడ పార్లమెంటు పరిధిలో ఏం చేశావో చెప్పు

నా కారు నంబర్, నా స్టిక్కర్ వాడాడు అంటారు

నా పై అనేక కేసులు ఉన్నాయంటున్న నాని కి దమ్ముంటే

అవన్నీ నిరూపించు… ఎన్నికల సంఘానికి చూపించు

నా మీద నిందలు వేస్తూ… ప్రజా సమస్యలు గా చిత్రీకరిస్తావా

అసలు ప్రజలకు ఏం చేశావో ఎందుకు  చెప్పడం  లేదు

పదేళ్లు ఎంపిగా ఎన్ని అభివృద్ధి పనులు చేశావో చెప్పాలి

ఫ్లైఓవర్ ల‌ నిర్మాణం నీ వల్ల జరిగిందా

అంటే కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం సహకారం లేకుండా నువ్వు ఒక్కడివే ఫ్లైఓవర్ కట్టావా

ఆనాడు సిఎంగా చంద్రబాబు స్థలాలు ఇచ్చి కేంద్రానికి ప్రతిపాదనలు పంపారు

ఎంపిగా ఢిల్లి వెళ్లి వస్తే… అన్నీ నువ్వే చేసినట్లా

రైల్వే ప్రాజెక్టు ల గురించి ఎప్పుడైనా మాట్లాడావా

కరోనా సమయంలో అడ్రెస్ లేకుండా ప్రజలను వదిలేసి వెళ్లిపోయావు 

నీ ఆధ్వర్యంలో ఒక్క కొత్త ఆసుపత్రి అయినా తెచ్చావా

చంద్రబాబు సిఎంగా ఉండి ఉంటే క్రైసిస్ మేనేజ్మెంట్ చూపించేవారు

జగన్ సంకన దాక్కున్న నువ్వు… ఆయన్ని నిలదీసే దమ్ముందా

అసలు విజయవాడ అభివృద్ధి కి జగన్ ఏం చేశాడో అడుగు

రాజకీయంగా ధైర్యం గా ఎదుర్కోలేక ఎదుటి వాళ్లపై నిందలు వేయడమే నీ పనా

ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నా… నేను అడిగిన వాటికి సూటిగా జవాబు ఇచ్చే ధైర్యం నీకు ఉందా

పివిపి పై నోరు పారేసుకుని నోటీసు అందుకోగానే కాళ్ల మీద పడిన వ్యక్తి వి నీవు

నా మీద ఎటువంటి కేసులు ఉన్నా , రేరా కేసు ఉన్నా నిరూపించు

అబద్దాలతో బతకడం మాని, వాస్తవాలు  ఎప్పు

ల్యాండ్ గ్రాబర్ అని‌ ప్రచారం చేస్తున్నావు.. ఎక్కడెక్కడ ఏమున్నాయో  బయట పెట్టు

నీ ఆఫీస్ పక్కన స్థలం కబ్జా చేయాలని చూస్తే పోలీసులు అడ్డుకున్నారు

నీ అరాచకాలు, భూకబ్జాల పై నీ సాక్షి, తో అన్ని మీడియా ల్లో ఆధారాలు ఉన్నాయి

రాయనపాడు, గుణదల శాటిలైట్  స్టేషన్ల  నిర్మాణం చేసి చూపిస్తాం

మెడికల్ కాలేజ్ నుంచి, నిడమానూరు వరకు మేము ఫ్లైఓవర్ నిర్మాణం

వెస్ట్, ఈస్ట్ లను కలుపుతూ స్పానల్ రోడ్ నిర్మాణం చేస్తాం 

కార్మికులు పొట్ట గొట్టి రాక్షస ఆనందం పొందిన వ్యక్తి మీ నాయకుడు

ఆటో మొబైల్ రంగాన్ని అభివృద్ధి చేసేలా నిధులు తెస్తా

అన్న క్యాంటీన్ల ను పూర్తి గా నిర్వహిస్తాం

నదుల అనుసంధానం వల్లే రైతాంగం బాగుంటుంది

మా చంద్రబాబు ఇదే చెబితే కుట్ర, కుళ్లుతో అబద్దాలు ప్రచారం చేశారు

నీటి ప్రాజెక్టు లు పట్టించుకోని మీ నాయకుడి వల్ల సాగు, తాగు నీటి సమస్యలు వచ్చాయి

ఆ ప్రాంతాలకు వెళ్లి ఎప్పుడైనా నువ్వు పరిశీలన చేశావా

నేను 264 గ్రామాలు తిరిగి వాటి అభివృద్ధి, మౌలిక వసతులకు ప్రణాళిక సిద్ధం చేశాం

2019-2024  వరకు ఎంపిగా నువ్వు ఏం చేశావో చెప్పు

ఢిల్లీ, హైదరాబాదు వెళ్లి గోల్ఫ్ ఆడుకోవడమే నీ పని

ప్రజల సమస్యలు పై కాకుండా వ్యక్తిగత ఆరోపణలు చేస్తావా

నీలాగా నేను వ్యక్తిగత దూషణలు చేసే వ్యక్తి ని కాను

నేను ప్రజలకు, నియోజకవర్గానికి ఏం చేస్తానో, ఏం చేయగలనో నేను చెబుతున్నా

దమ్ము, ధైర్యం ఉంటే నానీ మీడియా ముందుకు రా

నేను ఈ అభివృద్ధి చేశా, ప్రజలకు ఈ మంచి చేశా అని చెప్పు

అవిలేవు కాబట్టే. నా మీద వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నావు

రతన్ టాటా నా వల్లే వచ్చారు  అంటావు.. 2019  తరువాత వాళ్లు ఎందుకు కార్యక్రమాలు చేయలేదు

తొమ్మిదన్నరేళ్లు చంద్రబాబు గొప్ప అని  చెప్పిన నీకు… ఇప్పుడు ఆయన దెయ్యం అయ్యాడా

చిరంజీవి కన్నా గొప్ప నటుడు అని నాని నిరూపించుకున్నాడు

కలల రాజధాని అమరావతి వద్దు అని చెప్పడానికి సిగ్గు, శరం ఉందా

విజయవాడ పార్లమెంటు కు పోటీ చేసే అర్హత నీకు ఉందా

జగన్ తో జత కడితే… పైశాచికత్వం బయటకి వచ్చిందా

కూటమి అధికారంలోకి రాగానే అమరావతి ని అభివృద్ధి చేస్తాం

మీ నాయకుడు జగన్ పై ఎన్ని కేసులు ఉన్నాయో నీకు తెలియదా

వాటి గురించి మాట్లాడు… హామీలు అమలు చేయలేదని జగన్ ను ప్రశ్నించు

పార్టీ ఆఫీస్ ల పైనా, టిడిపి కార్యకర్తలు ఇంటి పైనా దాడి చేసిన చరిత్ర నీ పార్టీది

చంద్రబాబు వారసుకుగా మాకు అభివృద్ధి, సంక్షేమం తెలుసు, చేసి‌ చూపుతాం

జగన్ వారసులుగా బూతులు తిట్టే చరిత్ర మీది

భూకబ్జాలు, ఉద్యోగులకు జీతాలు ఇవ్వని చరిత్ర నీది

లేబర్ కోర్టు లో నీ పై కేసులు ఉంది వాస్తవం కాదా

మాకు రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం.. మాకు పని చేయడమే తెలుసు

నేను ఎప్పుడూ చిరాకు పడను, నోరు పారేసుకోను.. ప్రజల కోసం పని చేయడమే  నాకు తెలుసు

నానికి  అహంకారం ఎక్కువ… ఈ చిన్నీ కి ఆదరించే తత్త్వం  ఎక్కువ

ప్రజల అండతో విజయవాడ పార్లమెంటు  ను అభివృద్ధి చేసి చూపిస్తా

ప్రధాని మోడీ స్వయంగా వచ్చి ఇక్కడ రోడ్ షో చేశారంటే ప్రజలు అలోచన చేయండి

పవన్ కళ్యాణ్ రోడ్ షో, సభ ద్వారా ప్రజల్లో మంచి స్పందన వచ్చింది

మూడేళ్ల ల్లో ఎన్నో సేవా కార్యక్రమాలు సొంత ఖర్చుతో చేశా

కూటమి ప్రభుత్వం వచ్చాక  నా పని తీరు మీరే చూస్తారు

బూతులు తిట్టే వాళ్లని, రాష్ట్రాన్ని నాశనం చేసే వాళ్లని ఓడించండి

నా ఆస్తుల విషయంలో నేను వైట్ పేపర్ పెడతా

నాపై గానీ, నాకు బినామీ ఆస్తుల లెక్కలు చూపించాలని సవాల్ చేస్తున్నా

నాపై ఎటువంటి క్రిమినల్ కేసులు లేవు… ఉంటే చూపండి

ఆధారాలు లేని ఆరోపణలు చేస్తూ బురద జల్లడమే వారి పని

నేను సవాల్ చేస్తున్నా… దమ్ము, ధైర్యం ఉంటే నా పై కేసులు, అక్రమ అస్తులు ఉంటే ఆధారాలతో బయట పెట్టాలి

నాని ట్రావెల్స్ మూయడానికి, లోకేష్ కు అసలు సంబంధం ఏమిటి

బస్సులు నడపలేక, జీతాలు ఇవ్వలేక మూసుకుంది అతనే

ఆనాడు నిబంధనలు కు విరుద్ధంగా బస్సు లు నడపాలని నాని ప్రయత్నం చేశాడు

ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ పై తిరగబడిన వ్యక్తి నాని

చంద్రబాబు వాస్తవం తెలుసుకుని నానీతో ఆ అధికారికి సారీ చెప్పించారు

కేశినేని ట్రావెల్ మూసివేతకు నాని అసమర్థత కారణం

మంచి ట్రెండ్ ఉన్న సమయంలో నడపలేక పోయాడు

నేను దొంగ సంతకం పెట్టానంటున్న నాని.. నా పై క్రిమినల్ కేసు పెట్టవచ్చు కదా

చెల్లి ఏదో మాట అన్నదని.. ఆమె పై రెండు కేసులు పెట్టాడు

కేశినేని మా ఇంటి పేరు .. నాకు సర్వ హక్కులూ ఉన్నాయి

ప్రజా జీవితంలో నాని లాంటి వ్యక్తులు ఉండకూదు… సమాజానికే అది మంచిది కాదు

 ఇటీవలి ఒక హోటల్ కూడా నాని ప్రారంభించాడు

34 కోట్లు అప్పు తీసుకుని ఈ హోటల్ పెట్టాడు

రాము, హేమంత్ పేరు తో హోటల్ ట్రాన్సఫర్ చేశాడు

ఆర్.ఒ.సి  ఇంటిమేషన్ లేదు.. అంటే కుట్ర కోణమే కదా 

అప్పులు ఎగ్గొట్టేలా, మళ్లీ లీజు కు కూడా ఇచ్చాడు

ఇటువంటి అవినీతి, అక్రమాలు చాలా ఉన్నాయి

వీళ్లా నా పై ఆరోపణలు చేసేది… నేను నిరూపిస్తా..  దమ్ము ఉంటే వాళ్లు నిరూపించాలి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here