అంబ‌రాన్ని అంటిన ఎంపి కేశినేని శివ‌నాథ్ పుట్టినరోజు వేడుక‌లు

3
0

03-08-2025

అంబ‌రాన్ని అంటిన ఎంపి కేశినేని శివ‌నాథ్ పుట్టినరోజు వేడుక‌లు

ఎన్టీఆర్ భ‌వ‌న్ లో పండుగ వాతావ‌ర‌ణం

వేలాదిగా త‌ర‌లివచ్చిన నాయ‌కులు,కార్య‌క‌ర్త‌లు

ఎంపికి జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపిన ప్ర‌జా ప్ర‌తినిధులు

విజ‌య‌వాడ : విజ‌య‌వాడ పార్లమెంట్ స‌భ్యుడు ఎంపి కేశినేని శివ‌నాథ్ జ‌న్మ‌దిన వేడుక‌లు ఆదివారం గురునాన‌క్ కాల‌నీలోని విజ‌య‌వాడ పార్ల‌మెంట్ కార్యాల‌యం ఎన్టీఆర్ భ‌వ‌న్ లో అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగాయి. ఆదివారం ఉద‌యం నుంచి త‌న కార్యాల‌యంలోనే ఎంపీ కేశినేని శివ‌నాథ్ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు, ప్ర‌జ‌ల‌కు అందుబాటులో వున్నారు. ప్ర‌జాప్ర‌తినిధులు, టిడిపి నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు, అభిమానులు భారీ సంఖ్య‌లో తర‌లి వ‌చ్చి శుభాకాంక్ష‌లు తెలిపారు. ఎంపీ కేశినేని శివ‌నాథ్ కు కార్య‌క‌ర్త‌లు పూలాభిషేకం చేశారు.

ప్ర‌భుత్వ విప్, ఎమ్మెల్యే బొండా ఉమామ‌హేశ్వ‌ర‌రావు, ప్ర‌భుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య‌, ఎమ్మెల్యే కొలిక‌పూడి శ్రీనివాస‌రావు, రాజ్య‌స‌భ ఎంపీ సానా స‌తీష్‌, స్వ‌చ్ఛాంధ్ర కార్పొరేష‌న్ చైర్మ‌న్ కొమ్మారెడ్డి ప‌ట్టాభిరామ్, టిడిపి అధికార ప్ర‌తినిధి నాగుల్ మీరా, టిడిపి ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంక‌న్న, టిడిపి రాష్ట్ర కార్య‌నిర్వ‌హ‌క కార్య‌ద‌ర్శి బొప్ప‌న భ‌వ‌కుమార్, ఆర్య‌వైశ్య కార్పొరేష‌న్ చైర్మ‌న్ డూండీ రాకేష్‌, ఎపి బిల్డింగ్స్ అండ్ అదర్ కన్స్ స్ట్రక్షన్స్ వర్కర్స్ అడ్వైజర్ కమిటీ ఛైర్మన్ గొట్టుముక్కల రఘురామరాజు, టి శుభాకాంక్ష‌లు తెలిపి ఎంపీ కేశినేని శివ‌నాథ్ తో కేక్ క‌ట్ చేయించారు. అలాగే ఎంపి కేశినేని శివ‌నాథ్ కు టిడిపి యువ నాయ‌కులు బొండా ఉమామ‌హేశ్వ‌రరావు త‌న‌యులు బోండా సిద్ధార్థ, బోండా రవితేజ జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపారు.

ఆదివారం ఉద‌యం నుంచి రాత్రి వ‌ర‌కు కార్య‌క‌ర్త‌లకు అందుబాటులో వుండి వారి శుభాకాంక్ష‌లు అందుకున్నారు. త‌నపై ఇంత ప్రేమాభిమానులు చూపించినందుకు కృత‌జ్ఞ‌తలు తెలిపారు. విజ‌య‌వాడ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గాన్ని జిల్లాలోని ఎమ్మెల్యేల‌తో క‌లిసి అభివృద్ది ప‌థం దిశ‌గా న‌డిపిస్తాన‌న్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here