అందరి ప్రెస్ క్లబ్ గా మార్చటమా ..పోరాటానికి సిద్ధపడటమా

0
0

సమయం లేదు మిత్రమా ..

అందరి ప్రెస్ క్లబ్ గా మార్చటమా ..
పోరాటానికి సిద్ధపడటమా

“విజయవాడ ప్రెస్ క్లబ్” జర్నలిస్టుల అందరిది అయ్యే వరకు ఉద్యమం. ***విజయవాడ ప్రెస్ క్లబ్ అందరిది సాధన సమితి నాయకులు

ఆగస్టు 4న అంబెడ్కర్ విగ్రహం వద్ద కు విజయవాడ లో ఉన్న జర్నలిస్ట్ లు అందరు హాజరు కావాలని రౌండ్ టేబుల్ సమావేశాలో నేతలు పిలుపునిచ్చారు. బుధవారం వార్తప్రభ కార్యాలయంలో ప్రెస్ క్లబ్ సాధన జె ఏ సి సమావేశం జరిగింది. విజయవాడ లో ఉన్న ప్రెస్ క్లబ్ లో అర్హత గల జర్నలిస్ట్ లందరికి అవకాశం ఇవ్వాలని తాము డిమాండ్ చేస్తునమన్నారు. ఏ పి యు డబ్లు యు నేతల తీరు పై మాత్రమే నని ప్రెస్ క్లబ్ అంటే విలేకరులందరికీ అవకాశం ఇవ్వాలన్న లక్ష్యం గా పనిచేస్తునమాని, అందుకు ఆగస్టు 4న జిల్లా కలక్టర్ కు వినతిపత్రం అందజేసే కార్యక్రమం ఉందని ఉదయం 9.30గంటలకు డాక్టర్ అంబెడ్కర్ విగ్రహం వద్దకు హాజరు కావాలని కోరారు. 1975లో కేవలం ప్రెస్ క్లబ్ గానే ప్రారంభం అయిందని, 2018 లోఏ పి యు డబ్లు యు యూనియన్ పేరుమీద రిజిస్ట్రేషన్ అయ్యిందని అన్నారు. ఆగస్టు 6న ఛలో సచివాలయం ను విజయవంతం చెయ్యాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం లో వివిధ యూనియన్ లకు చెందిన నేతలు
వీర్ల శ్రీరామ్ యాదవ్, అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ మీడియా ప్రొఫెషనల్ అసోసియేషన్ (ఏపీ ఏం పి ఏ)
చందన మధు అధ్యక్షులు ది ఆంధ్ర ప్రదేశ్ జర్నలిస్టు అసోసియేషన్, కూర్మా ప్రసాద్ బాబు అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ పత్రికా సంపాదకుల సంఘం, రామకృష్ణ రాష్ట్ర అధ్యక్షులు ఇండియన్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్, కాకుమాను వెంకట వేణు అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల యూనియన్ (ఏపీజేయు)
శ్రీనివాస్ రాష్ట్ర అధ్యక్షులు ఆల్ ఇండియా జర్నలిస్ట్ అసోసియేషన్,
మేడవరపు రంగనాయకులు అధ్యక్షులు తెలుగు జర్నలిస్టు సంక్షేమ సంఘం, అద్దంకి
దయాకర్ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్, గాంధీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం,
చరవాణి ద్వారా విజయవాడ సాధన సమితి జేఏసీకి మద్దతు పలికిన జాతీయ రాష్ట్ర స్థాయి సంఘాలు
మోల్లి కమల్ కుమార్ రాష్ట్ర జనరల్ సెక్రెటరీ, అసోసియేషన్ మీడియం న్యూస్ పేపర్స్ ఆఫ్ ఇండియా,
చొప్పారపు సాంబశివ నాయుడు అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ రిపోర్టర్స్ యూనియన్,
బండి సురేంద్రబాబు అధ్యక్షులు నేషనల్ యాక్టివ్ రిపోర్టర్ అసోసియేషన్, ఆలీ అధ్యక్షులు ఆంధ్ర ప్రదేశ్ జర్నలిస్టుల అసోసియేషన్, మారీదు ప్రసాదు అధ్యక్షులు డెమొక్రటిక్ జర్నలిస్ట్ యూనియన్, కలుమ శ్రీ జిల్లా అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్,
మానేపల్లి మల్లికార్జున, వెంకట్, కోటేశ్వరరావు, అనిల్, ప్రశాంత్, శ్రీనివాస్ రావు ఎమ్మెస్సార్, కోట రాజా, రాజేష్, హుమాయున్, వెంకట్ మనం,
ఇతర జర్నలిస్టులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here