ఎన్.టి.ఆర్ జిల్లా పోలీస్ కమీషనర్ వారి కార్యాలయము, విజయవాడ
తేది.26-06-2025
అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఇంధీరాగాంధి మున్సిపల్ స్టేడియం నందు కళాశాల విద్యార్ధినీ విద్యార్ధులకు డ్రగ్స్ వినియోగం వలన కలిగే అనర్దాలపై అవగాహనా సదస్సు నిర్వహించిన ఎన్.టి.ఆర్.జిల్లా పోలీసులు.
సుమారు 3000 మంది వివిధ శాఖల సిబ్బంది మరియు కళాశాల విధ్యార్ధిని విధ్యార్ధులతో స్టేడియం నుండి డి.వి.మ్యానర్ హోటల్ వరకు మెగా వాకథాన్
ది.26.06.2025 తేది అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మరియు ఆంధ్రరాష్ట్రాన్ని మాదకద్రవ్య రహిత రాష్ట్రంగా మార్చాలనే ఉద్దేశంతో రాష్ట్ర డి.జి.పి. హరీష్ కుమార్ గుప్తా ఐ.పి.ఎస్ ఆదేశాల మేరకు ఎన్.టి.ఆర్ జిల్లా పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్ ఆధ్వర్యంలో ఈ రోజు ఇంధీరాగాంధి మునిసిపల్ స్టేడియం నందు కళాశాల విద్యార్ధినీ విద్యార్ధులకు”డ్రగ్స్ కు బానిస కావద్దు నీ తల్లి కన్నీటికి కారణం అవ్వద్ధు.” “డ్రగ్స్ ను తరిమి కొడదాం – యువతను కాపాడుధాం” అనే నినాధాలతో డ్రగ్స్ వినియోగం వలన కలిగే అనర్ధాలపై అవగాహన కల్పించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఎన్.టి.ఆర్ జిల్లా పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్ జిల్లా కలెక్టర్ లక్ష్మి షా ఐ.పి.ఎస్., ఎం.ఎల్.ఏ. గద్దె రామ్మోహన రావు , డి.సి.పి.లు కె.జి.వి.సరిత ఐ.పి.ఎస్. ఎ.బి.టి.ఎస్.ఉదయారాణి ఐ.పి.ఎస్. కృష్ణ మూర్తి నాయుడు ఎ.డి.సి.పి.లు జి.రామ కృష్ణ ఎ.వి.ఎల్ ప్రసన్న కుమార్ సబ్ కలెక్టర్ కావూరి చైతన్య ఈగల్ టీం సభ్యులు, అన్నీ శాఖల అధికారులు, సిబ్బంది మరియు వివిధ కళాశాలల విధ్యార్ధినీ విధ్యార్ధులు సుమారు 3000 మంది వరకు పాల్గొన్నారు.
ఈ సంధర్భంగా డి.సి.పి. కె.జి.వి.సరిత ఐ.పి.ఎస్. మాట్లాడుతూ…. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు అన్నీ జిల్లాలో జిల్లా కలెక్టర్ మరియు పోలీసు కమిషనర్ ఆద్వర్యంలో అన్నీ ప్రభుత్వ శాఖల మరియు కళాశాలల విధ్యార్ధినీ విధ్యార్థులతో పెద్ద ఎత్తున అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా మా ఆహ్వానాన్ని మన్నించి ఈ కార్యక్రమానికి విచ్చేసిన అంధరికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున, మా పోలీస్ శాఖ మరియు ఎన్టీఆర్ జిల్లా యాజమాన్యం తరఫున హార్దిక ధన్యవాదాలు స్వాగతం తెలియజేసుకుంటూ ఉన్నాం. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ అయ్యేవిధంగా ఇతర డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఎంతో చక్కటి సమన్వయం చేసుకుని ఈ ఇంటర్నేషనల్ డే అగైనెస్ట్ డృగ్ అబ్యూస్ అండ్ ఇల్లిసిట్ ట్రాఫికింగ్ -2025 సెలెబ్రేట్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడే సి.పి. చాలా గట్టి వాయిస్ ఇచ్చారు ఎట్టి పరిస్థితుల్లోనూ జిరో టోలరెన్స్ టు డృగ్ అనే నినాదం వంధశాతం చేసేంత వరకు ఆంధ్రప్రదేశ్ పోలీస్ నిద్రపోదు అని చెప్పారు, అధెవిధంగా జిల్లా కలెక్టర్ ఆంధ్రప్రదేశ్ ని డ్రగ్స్ రహిత ఆంధ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని చెప్పారు వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు.
ఎం.ఎల్.ఎ. గద్దె రామమోహన్ రావు మాట్లాడుతూ…. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేకంగా చేపట్టిన ఈ ప్రపంచంలో ఈరోజు అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవంగా చేసిన సందర్భంగా డ్రగ్స్ ను నిరోధించడానికి ప్రతి ఒక్కళ్ళు కృషి చేయాలి, మాదకద్రవ్యాల వలన కలిగే నష్టం గురించి ప్రత్యేకంగా యువత విద్యార్థుల్లో అంధరికి అవగాహన కల్పించాలి, ఈ సమాజానికి భావిభారత పౌరులుగా ఉన్న మీకు ఈ యొక్క కార్యక్రమం నుంచి ప్రజలందరినీ కాపాడుకు కాపాడే బాధ్యత కూడా మన మీద ఎంతో ఉంది అని ఆలోచించి ఈ రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రత్యేక గుంటూరు పట్టణంలో ఆయన ఈ కార్యక్రమాన్ని ఆయన స్వయంగా చేపట్టారు. ఇదే సేవలో మన విజయవాడ నగరం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అధికారి యంత్రాంగని మనస్పూర్తిగా అభినంధానాలు తెలియజేస్తూ ఇది ప్రతి ఒక్కరి సమస్య, ఈ సమస్యకు పరిష్కారం ఒక కలెక్టర్ చేతుల్లోనూ సిపి చేతుల్లోనే ఉందనుకుంటే అది కరెక్ట్ కాదు, ప్రతి తల్లి, ప్రతి తండ్రి, ప్రతిబిడ్డ, డృగ్ రహిత అవసరాన్ని గురించి ఆలోచించవలసిన అవసరం ఉంది. ఈ రోజున ప్రతి తల్లిదండ్రులు కూడా తమ బాధ్యతగా తన కుటుంబంలో ఎవరికైనా అలాంటి అలవాటున్న అలాంటి అలవాటు అలవాటు పడే అవకాశం ఉన్న దాని కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది అంతేగాని ఎవరైనా మన ఇంట్లో ఒక వ్యక్తి దానికి అలవాటు పడితే కుటుంబమంతా సర్వనాశనం కాకుండా చుట్టుపక్కల ఉన్న సమాజం అంతా కూడా సర్వనాశనం అవుద్ది. కాబట్టి దీన్ని మనస్ఫూర్తిగా అవగాహన చేసుకుని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయుటమే కాకుండా నిత్యము అది మనం మనసులో పెట్టుకొని అవకాశం ఉంది మేరకు దీనికి అవగాహనపర్చడానికి ప్రయత్నం చేయాలని తెలియజేశారు.
అనంతరం నగర పోలీసు కమిషనర్ శ్రీ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్. మాట్లాడుతూ.ఈ కార్యక్రమం సంధర్భంగా ఇక్కడకు వచ్చిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక నమస్సుమాంజలు తెలియజేసినారు. ఈ రోజు అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సంధార్బంగా ఒక పెద్ద కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాము, డ్రగ్స్ రహిత ఆంధ్ర ప్రదేశ్, డ్రగ్స్ రహిత ఎన్టీఆర్ జిల్లా సాధన దిశగా మన వేస్తున్న తొలి అడుగుగా వేస్తున్నాము. గత ఒక సంవత్సరం నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మాదకద్రవ్యాల వినియోగంపై ఉక్కు పాదం మోపి ముందుకు వెళ్ళడం జరిగితుంది కొన్ని వందల అరెస్టులు జరుగుతున్నాయి కొన్ని వేల కేజీలు గంజాయి సీజ్ చేసిన కూడా ఇంకా ఆ ట్రీస్ ఇంకా ఉన్నాయి ట్రీసెస్ ని కచ్చితంగా మొత్తం తీసేయాలి అంటే పోలీస్ శాఖ చాలా గట్టిగాకృషి చేయడం జరుగుతుంది. ఈ మధ్యన రాష్ట్ర ప్రభుత్వం వారు పిట్ ఎన్ డి పి ఎస్ యాక్ట్ అనే ఒక ప్రివెంటివ్ డిటెక్షన్ యాక్ట్ మీద కేసెస్ పెట్టమని చెప్పడం జరిగింది. దీని వలన ఈ కేసులో వారిని ఎటువంటి విచారణ లేకుండా ఒక సంవత్సరం జైలు లో పెట్టడం జరుగుతుంది. అందులో భాగంగా ఇప్పటికీ 11 మంది మీద ఈ యాక్ట్ పెట్టి గవర్నమెంట్ ని పంపించడం జరిగింది. అందులో ఐదు మంది అమలు చేస్తున్నాము, మాదకద్రవ్యాల వినియోగం మరియు రవాణా అనేది ఎటువంటి పరిస్థితిలో సహించేది లేదు అన్న విషయాన్ని స్పష్టంగా సమాజానికి తెలియ చెప్పాలని ఉద్దేశంతో చాలా కఠినంగా వ్యవహరిస్తున్నాము సో దయచేసి విద్యార్థులు కూడా ఇటువంటి గంజా పోకడలకు వెళ్లకూడధనే విషయాన్ని అందరూ గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ మధ్య మేము ఒక చిన్న ఆపరేషన్ చేశాం ఎంతమంది అసలు గంజాయి సేవిస్తారు అని, ఒక వ్యక్తి దొరికితే అతనిని విచారిస్తే దాదాపు 125 మంది విద్యార్థులు పేర్లు బయటకు వచ్చాయి. దీనిపై శక్తి వంచనలు లేకుండా అన్నీ శాఖాల సమన్వయంతో ముఖ్యంగా జిల్లా కలెక్టర్ ఆద్వర్యంలో జిల్లాలో వైద్య ఆరోగ్యశాఖ అధికారిగా విద్యాశాఖ పోలీస్ శాఖ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అందరు కూడా కలిసికట్టుగా ఒక బహుత్కర కార్యక్రమంతో ఈరోజు ముందుకు వెళ్తున్నాము, ఇధి ఇంతటితో ఆగధు చివరి కేజీ గంజా సీజ్ చేసే వరకు గంజాయిని సమూలంగా తొలగించే వరకు నిద్రపోవాల్సిన అర్హత మనకు లేదని గుర్తుపెట్టుకుని ముంధుకు వెళ్ళాలి అని తెలియజేశారు.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ రోజు అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవంలో భాగంగా ఎన్టీఆర్ జిల్లాలో విజయవాడలో ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సీపీ కి పోలీసు డిపార్ట్మెంట్ కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను, ఇది చాలా అవసరం మనం అవేర్నెస్ ఎంత క్రియేట్ చేస్తామో అంత పిల్లల్ని అలాగే సమాజాన్ని ఈ డ్రగ్స్ బారినుంచి దూరంగా పెట్టగలుగుతాము, నీకేమైనా చెడు అలవాటు ఉంటే ఇప్పుడే తప్పుకోండి జిల్లా నుంచి వెళ్లిపోండి తప్పతే ఇక్కడగనక తప్పులు చేస్తాం అనుకుంటే మాత్రం వదిలేయలేదు జాగ్రత్తగా ఉండండి. ఇదే సమయంలో తల్లిదండ్రులందరికీ అలాగే పిల్లలందరికీ టీనేజర్స్ కి ఎవరైతే క్యూరియాసిటీతో చేస్తున్నాడో వారికి చిన్న సలహా డ్రగ్స్ తీసుకోవడం కన్నా విషం తీసుకోవడం ఎంతో మంచిది ఎందుకంటే విషం తీసుకుంటే ఒకసారి చనిపోతారు డ్రగ్స్ తీసుకుంటే సమాజాన్ని, మీ కుటుంబాన్ని చంపేసి తర్వాత చనిపోతారు, ఎవరైనా మీ స్కూల్లో కాలేజెస్ లో లేదా మీ ఇంటి పక్కన చుట్టుపక్కన ఎవరైనా తీసుకుంటున్నారంటే వాళ్ళు చేసే వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ మీ దగ్గరలో ఉన్న పోలీస్ శాఖకు గాని, సచివాలయంలో ఉన్న డిపార్ట్మెంట్ అధికారులకు గాని తెలియజేయండి. వాళ్ళను ఏమి చేయము డృగ్ డీ అడిక్షన్ సెంటర్ల ద్వారా వారికి ఈ అలవాటు మనుకునేలాగా నేర్పించడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఈ డృగ్ మహామారుని మనం తరిమికొట్టాలి మన సమాజం మా విజయంతో విజన్ 2024 నుంచి దూరం చేయాలి ఇది భావితరాలకు మంచిది, భవిష్యత్తుకు మంచిది, సమాజానికి మంచిది అని తెలియజేశారు.
అనంతరం డి.సి.పి. కె.జి.వి.సరిత ఐ.పి.ఎస్. కార్యక్రమానికి వచ్చిన అందరితో…… అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం నాడు నేను ఈ ప్రతిజ్ఞ చేయుచున్నాను. మనదేశ భావితరాల భవిష్యత్ దృష్ట్యా మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని మాదక ద్రవ్యాల నుంచి విముక్తి చేయడానికి కృషి చేస్తానని, మాదకద్రవ్యాల వినియోగాన్ని వ్యతిరేకిస్తాననీ, ఇతరులను కూడా అదేవిధంగా వ్యతిరేకించడానికి ప్రోత్సహిస్తానని, మాదకద్రవ్యాల వినియోగం వలన కలిగే దుష్పరిణామాల గురించి నా కుటుంబ సభ్యులకు, స్నేహితులకు మరియు సమాజానికి తెలియచేస్తానని, ఈ ఉద్యమం లో చురుకుగా పాల్గొంటానని, ఉచిత టోల్ ఫ్రీ నెంబర్లు 112 లేదా 1972 గురించి అవగాహనా మరియు చైతన్యం కలిగిస్తూ మాదకద్రవ్య రహిత ఆంధ్ర ప్రదేశ్ నిర్మాణానికి కృషి చేస్తానని, మనఃసాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను అని ప్రతిజ్ఞ చేయించడం జరిగింది.
అనంతరం ఇంధిరాగాంధి మునిసిపల్ స్టేడియం నుండి ర్యాలీ ప్రారంభించి హోటల్ డి.వి.మ్యానర్ వరకు బందర్ రోడ్డులో మెగా వాకథాన్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.