ఎన్.టి.ఆర్. జిల్లా పోలీస్ కమీషనర్ వారి కార్యాలయము, విజయవాడ తేదీ.08-03-2025
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సంధర్భంగా ఎన్.టి.ఆర్.జిల్లా పోలీస్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ (3K రన్)
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సంధర్భంగా ఈ రోజు ది.08.03.2025 వ తేదీన నగర పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్.సారధ్యంలో ఇందిరాగాంది మున్సిపల్ స్టేడియం నుండి బెంజ్ సర్కిల్ వరకు సుమారు 2000 మందితో (3కే. రన్) ర్యాలీని నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిదిగా జిల్లా కలెక్టర్ జి.లక్ష్మి శా ఐ.ఏ.ఎస్ నగర పోలీసు కమిషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి,ఎస్ , డి.సి.పి.లు గౌతమి షాలి ఐ.పి,ఎస్ కె.జి.వి.సరిత ఐ.పి,ఎస్ తిరుమలేశ్వర రెడ్డి ఐ.పి,ఎస్ ఏ.బి.టి.ఎస్.ఉదయరాణి ఐ.పి,ఎస్, కృష్ణ మూర్తి నాయుడు ఏ.డి.సి.పి.లు, ఎ.సి.పి.లు, ఇన్స్పెక్టర్లు, వివిధ కళాశాల విధ్యార్ధినులు, మహిళలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో దుర్గా మల్లేశ్వర సిద్దార్థ మహిళా కళాశాల విధ్యార్ధునులు వాయించిన డప్పు వాయిధ్యం, చిన్నపిల్లల స్కేటింగ్ మరియు మహిళా పోలీస్ (డ్రోన్ పైలెట్స్) చేసిన డ్రోన్ షో లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఈ సందర్భంగా ముఖ్య అతిదిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ జి.లక్ష్మిశా ఐ.ఏ.ఎస్. మాట్లాడుతూ….. వేదిక మీద ఉన్న అధికారులకు, మహిళా పోలీసు సిబ్బందికి, కళాశాల విద్యార్ధినులకు, మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ముందుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇంత మంచి కార్యక్రమం నిర్వహించిన నగర పోలీసు కమిషనర్ కి ధన్యవాధాలు తెలియజేసినారు. టీం ఎన్.టి.ఆర్.డిస్ట్రిక్ట్ ప్రోగ్రస్ ఏమైనా చేయాలి అంటే కంపల్సరీ ది కంట్రిబ్యూషన్ ఆఫ్ విమెన్ పవర్ ఇన్ థిస్ ప్రోగ్రెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అని తెలియజేశారు.
అనంతరం నగర పోలీసు కమిషనర్ మాట్లాడుతూ.ఈ రోజు ర్యాలీకి విచ్చేసిన సోదరీమణులకు అందరికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముందుగా కలెక్టర్ కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పోలీస్ శాఖ నిర్వహించిన ఈ ర్యాలీకి వారు ముఖ్య అతిథిగా రావడానికి చాలా సంతోషం ఈరోజు మనం చూస్తే మహిళా శక్తి ఎంత గొప్పగా ముందుకు పోతుందో ఈ లాస్ట్ వన్ వీక్ లో జరుగుతున్న కార్యక్రమాలు చూస్తే మనకు అర్థమవుతుంది, వివిధ ప్రభుత్వ శాఖల్లో లాస్ట్ వన్ వీక్ ఒక పండుగగా ఈ మహిళా దినోత్సవం జరుపుకోవడం అనేది చాలా ముదావహం ఎందుకంటే వారి పాత్ర ఏదైతే ఉందో సమాజాభివృద్ధిలో వారి రోల్ ఎంతో కీలకమని గుర్తించి వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా వారిని ప్రగతి పథంలో నడిపిస్తూ వారి గౌరవాన్ని వారికి ఇవ్వాలనే ఉద్దేశంతో మనం ఎన్నో కార్యక్రమాలు చేపట్టినాం. ముఖ్యంగా పోలీస్ శాఖ ఉమెన్ సేఫ్టీ గురించి నిరంతరం కృషి చేస్తూ ఈ రోజు ఒంగోలు మార్కాపురంలో ముఖ్యమంత్రి శక్తి అనే ఒక మొబైల్ అప్లికేషన్ కూడా లాంచ్ చేస్తున్నారు, పోలీస్ శాఖ ఎల్లవేళలా మహిళ సంరక్షణకు కట్టుబడి ఉంటుంది నేను ప్రతి సందర్భంలో చెప్తాను, మహిళలకు గౌరవం లభించే శాఖలో పోలీస్ శాఖ ప్రధానంగా ఉంటుంది, ఈరోజు చాలామంది పోలీస్ శాఖలో చేరుతూ విభిన్నంగా వినూత్నంగా వారు సేవలు అందిస్తున్నారు, ఈరోజు ఈ ర్యాలీలో మీరు చూస్తారు 27 మండి మహిళా డ్రోన్ ఆపరేటర్స్ తో డ్రోన్ షో కూడా ఉండబోతుంది, అదేవిధంగా చాలా సందర్భాల్లో పోలీస్ శాఖ పోలీసు సేవాధళ్ పేరుతో ఎన్నో విభిన్న కార్యక్రమాలు చేస్తూ ఈరోజు మహిళకి అండగా నిలుస్తున్నారు, పోలీస్ శాఖ ఎల్లవేళలా మహిళ సంరక్షణలో మహిళలకు పూర్తి భద్రత కల్పించడంలో మమేకమవుతూ ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా అందరికి శుభాకాంక్షలు అని తెలియజేశారు.
డి.సి.పి. గౌతమి షాలి ఐ.పి.ఎస్. మాట్లాడుతూ.ముందుగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన సోదరీమణులకు అందరికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కాలంలో చదువు విషయంలో గాని, ఉద్యోగం విషయంలో గాని అంధరం సమానమేనని, జెండర్ ఎధైన కావచ్చు ప్రతి ఒక్కరితో గౌరవంగా మెలగాలి. ఈ విషయాన్ని అంధరూ గుర్తు పెట్టుకోవాలి. మహిళలు అంధరూ కుక్కింగ్, పెయింటింగ్, రీడింగ్ మొదలైనవి అన్నీ నేర్చుకోవాలి. విధ్యతో పాటు అన్నీ నేర్చుకోవాలి అని తెలియజేశారు. అంధరికి మరొకసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
అడ్మిన్ డి.సి.పి. కె.జి.వి.సరిత ఐ.పి.ఎస్. మాట్లాడుతూ మన జిల్లా కలెక్టర్ లక్ష్మీ కి మా ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పోలీసు కమిషనర్ ఎస్ వి రాజశేఖర్ బాబు ఐపిఎస్ కి నమస్కారాలు తెలియజేసుకుంటూ, వేదిక అలంకరించిన ఇతర ఉన్నతాధికారులందరికీ వేదిక వెలుపల ఉన్నటువంటి మా పోలీస్ శాఖ అధికారులు అందరికీ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఎన్.సి.సి., ఎన్.ఎస్.ఎస్. మిగితా వాలంటీర్స్ అందరికీ విద్యార్థిని విద్యార్థులు అందరికీ టీచర్స్ ఇతర శాఖల నుంచి విచ్చేసినటువంటి అతిథులందరికీ హార్థిక నమస్కారాలు మరియు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. 2025 అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి నినాదంగా ఆక్సిలరేటెడ్ ఆక్షన్ ఫర్ జెండర్ పార్టీ లింగ సమానత్వం కోసం వేగవంతమైనటువంటి కార్యాచరణ అనే నినాదంతోటి 2025 అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్న ఈ వేగవంతమైనటువంటి కార్యాచరణ ఆక్సిలరేటర్ యాక్షన్ ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ దానికి నిదర్శనం. సేఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ సేఫ్ లేబర్ హుడ్ అనే నినాదంతోటి మన సీపీ సురక్ష కమిటీస్ అనేవి స్టార్ట్ చేయడం జరిగింది. ఆల్రెడీ ఆ సురక్ష కమిటీలో భాగంగా మహిళా భద్రతకి పెద్దపీట వేస్తూనే మహిళలకు,విధ్యార్ధినులకు ఇన్ కన్వీనియన్స్ కలగకుండా సేఫ్ ఎన్విరాన్మెంట్ ఇచ్చేందుకు ప్రతి రోజూ ఉదయం సాయంత్రం సమయాలలో కళాశాలు, స్కూల్స్ వద్ద క్లౌడ్ పెట్రోలింగ్ ద్వారా ఈవ్ టీజింగ్ జరుగకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మీరు మహిళా భద్రత కోసం మహిళలు గౌరవించుకోవడం కోసం ఇంత పెద్ద ఎత్తున విచ్చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు. “తోచినట్టుగా అందరి రాతను బ్రమ్మే రాస్తాడు నచ్చినట్టుగా నీ తలరాతని నువ్వే రాయాలి నీ ధైర్యాన్ని దర్శించి దైవాలే తలదించగా నీ అడుగుల్లో గుడి కట్టి స్వర్గాలే తరించగా అంతులేని చరితలకి ఆది నువ్వు కావాలి” అని తెలియజేశారు.
అనంతరం స్టేడియం నుండి జిల్లా కలెక్టర్ పోలీసు కమిషనర్ కలిసి జెండా ఊపి ర్యాలీని ప్రారంబించడం జరిగింది. అక్కడ నుండి బెంజ్ సర్కిల్ వరకు ర్యాలిగా నడుచుకుంటూ వెళ్ళి బెంజ్ సర్కిల్ వద్ద మహిళా పోలీసులచే డ్రోన్ షో నిర్వహించిన అనంతరం ముగింపు పలికారు.