
విషంకక్కడం మానుకో…
- జగన్ కు మంత్రి సవిత హితవు
- సీఎం చంద్రబాబు హయాంలో అభివృద్ధి పరుగులు
- ఓర్వలేకపోతున్న వైసీపీ బ్యాచ్
- సొంత కార్యకర్తలనే వేధించిన చరిత్ర నీది…
- ఉషశ్రీ చరణ్ పై మంత్రి సవిత మండిపాటు
- కళ్యాణదుర్గం అభివృద్ధిపై చర్చకు వస్తా… డేట్ చెప్పు : మంత్రి సవిత
- బీచిగానిపల్లిలో రూ.80 సీసీ రోడ్డు నిర్మాణానికి మంత్రి సవిత శంకుస్థాపన
పరిగి/శ్రీసత్యసాయి : అప్పులు, పశు, జింక మాంసాల పేరుతో సొంత కార్యకర్తలనే కేసుల పెట్టి, వేధించిన చరిత్ర మీదని, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమంపై విషం కక్కడం మానుకోవాలని, కూటమి ప్రభుత్వానికి సహకరించాలని జగన్ కు, ఆయన పార్టీ నాయకులకు హితవు పలికారు. పరిగి మండలం పాత్రగానీపల్లి గ్రామం నుంచి బీచిగానిపల్లి గ్రామం వరకు రూ.80 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణానికి ఆమె శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా బీచిగానిపల్లిలో నిర్వహించిన సమావేశంలో మంత్రి సవిత మాట్లాడారు. సీఎం చంద్రబాబునాయుడు ప్రభుత్వం హయాంలో రాష్ట్రంలోనూ, నియోజక వర్గంలోనూ అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెడుతోందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే బీచిగానిపల్లిలో ఉపాధి హామీ పథకం కింద రూ.4 కోట్లతో 56 పనులు చేశామన్నారు. రూ.76 లక్షలతో సీసీ రోడ్లు, కాలువలు నిర్మించామన్నారు. తాగునీటి కల్పనకు మూడు ఓవర్ హెడ్ ట్యాంకులు నిర్మించామన్నారు. రూ.2 కోట్లు వెచ్చించి బీసీ హాస్టల్ ను నిర్మిస్తున్నామన్నారు. ఇప్పటికే బీసీ, ఎస్సీ హాస్టళ్ల మరమ్మతులు చేపట్టామన్నారు. సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలు అమలు చేశామని, సంక్షేమంతో పాటు సంపద సృష్టిస్తున్నామని, ఉపాధి కల్పిస్తున్నామని వెల్లడించారు. అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత గ్యాస్ సిలిండర్లు వంటి ఎన్నో పథకాలు అమలు చేస్తున్నామని మంత్రి సవిత తెలిపారు. లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొస్తున్నామన్నారు.
విషం కక్కడం మానుకో…
జగన్ అయిదేళ్ల పాలనలో జరగని అభివృద్ధి, సంక్షేమం కూటమి ప్రభుత్వం వచ్చిన 18 నెలల కాలంలోనే చేసి చూపించామని మంత్రి సవిత తెలిపారు. సీఎం చంద్రబాబు సమర్త నాయకత్వంలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి చూసి జగన్, ఆయన పార్టీ నాయకులు ఓర్వలేకపోతున్నారన్నారు. రప్పా..రప్పా… అంటూ అధికారులను, కాంట్రాక్టర్లను, పెట్టుబడిదారులను కూడా బెదిరిస్తున్నారన్నారు. వారి బెదిరింపులకు ఎవరూ బెదిరిపోరన్నారు. వారు ఎంతరెచ్చగొట్టినా, కూటమి ప్రభుత్వం సంయమనం పాటిస్తోందన్నారు. ఇప్పటికైనా జగన్ పద్దతి మార్చకోవాలని, కూటమి ప్రభుత్వం విషం కక్కడం మానుకోవాలని, అభివృద్ధికి సహకరించాలని మంత్రి సవతి హితవు పలికారు.
సొంత కార్యకర్తలనే వేధించిన చరిత్ర నీది…
అప్పులు, జింక, పశు మాంసాల పేరుతో సొంత కార్యకర్తలపైనే కేసులు పెట్టి వేధించిన చరిత్ర నీదని మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ పై మంత్రి సవిత ఫైరయ్యారు. అయిదేళ్లలో కళ్యాణదుర్గంలో చేసిన అభివృద్ధిపై తాను చర్చకు సిద్ధంగా ఉన్నానని, డేట్ చెప్పు వస్తానని మంత్రి సవిత సవాల్ విసిరారు. 18 నెలల కాలంలో పెనుకొండ నియోజక వర్గంలోనూ, బీచగానిపల్లిలో చేపట్టిన అభివృద్ధిపైనా చర్చకు రెడీ అని స్పష్టంచేశారు. వలస పక్షుల మాటలను పెనుకొండ నియోజక వర్గ ప్రజలు పట్టించుకోరన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అధిక సంఖ్యలో బీచిగానిపల్లి వాసులు పాల్గొన్నారు.
![]()
