ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరైన ఆర్థికసాయాన్ని మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణప్రసాదు లబ్ధిదారులకు చెక్కుల రూపంలో అందజేశారు.

3
0

సీఎంఆర్ఎఫ్ నుంచి ఆర్థికసాయం మంజూరు.

చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే కృష్ణప్రసాదు గారు.

ఎన్టీఆర్ జిల్లా, మైలవరం, 24.07.2025

ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరైన ఆర్థికసాయాన్ని మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణప్రసాదు లబ్ధిదారులకు చెక్కుల రూపంలో అందజేశారు.

జి.కొండూరు మండలం పినపాక గ్రామానికి చెందిన ముగ్గురు లబ్ధిదారులు కలేకూరి కుమారి, నక్కనబోయిన శివయ్య, ఉండ్రకొండ ఆదిలక్ష్మి లకు సీఎంఆర్ఎఫ్ నుంచి రూ. 67,214/- మంజూరయ్యాయి. వీటికి సంబంధించిన చెక్కులను శాసనసభ్యులు కృష్ణప్రసాదు కట్టుబడి పాలెం పంచాయతీ కార్యాలయం వద్ద అందజేశారు.

చెక్కులతో పాటు సీఎం చంద్రబాబు సందేశ పత్రాలను కూడా ఎమ్మెల్యే కృష్ణప్రసాదు వారికి అందజేశారు. లబ్ధిదారుల ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేశారు. ఈ సొమ్మును సద్వినియోగం చేసుకోవాలని వారికి సూచించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ సీఎం కి, శాసనసభ్యులు వసంత కృష్ణప్రసాదు కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here