‘న్యూరాలింక్’ తొలి పేషెంట్

6
0


 టెక్ ఆంత్రప్రెన్యూర్ ఎలాన్ మస్క్‌కు చెందిన న్యూరాలింక్ సంస్థ మరో అద్భుతం సాధించింది. న్యూరాలింక్ మైక్రో‌చిప్‌ను మెదడులో అమర్చుకున్న తొలిపేషెంట్ కేవలం తన ఆలోచనలతో కంప్యూటర్‌ను నియంత్రించగలిగారు. ఆన్‌లైన్‌లో చెస్, వీడియో గేమ్ ఆడారు. 


29 ఏళ్ల నోలాండ్ ఆర్‌బర్గ్‌‌కు ఓ యాక్సిడెంట్ కారణంగా భుజాల నుంచి కాళ్ల వరకూ శరీరం చచ్చుబడిపోయింది. ఈ క్రమంలో ఆయన మెదడులో న్యూరాలింక్ శాస్త్రవేత్తలు కంప్యూటర్ చిప్ అమర్చారు. ఈ చిప్ ఉన్న తొలి పేషెంట్‌గా రికార్డు సృష్టించిన నోలాండ్ తాజాగా కేవలం తన ఆలోచనలతో కంప్యూటర్ గేమ్స్ ఆడారు. స్క్రీన్‌పై ఉన్న మౌస్ ఐకాన్‌ను మెదడుతో నియంత్రించారు. ‘‘స్క్రీన్‌పై మౌస్ కదలడం చూశారుగా? దాన్ని నేను మెదడుతో నియంత్రించా. అద్భుతం కదూ?! చేయిని కదిపినట్టు, మౌస్ ను కదిపినట్టు అనుకుంటే స్క్రీన్‌పై ఆమేరకు మౌస్ కదులుతుంది. మొదట్లో కాస్త తికమకగా ఉన్నా ఆ తరువాత విషయం పూర్తిగా అవగతమవుతుంది. ఈ అనుభవాన్ని మాటల్లో వర్ణించలేను. న్యూరాలింక్ అధ్యయనంలో భాగమైనందుకు నేనెంతో అదృష్టవంతుణ్ణి’’ అని నోలాండ్ చెప్పుకొచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

https://t.co/OMIeGGjYtG

— Neuralink (@neuralink) March 20, 2024

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here