అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహం మరియు అమరావతిలో సీతారామరాజు శృతి వనం ఎర్పాటు చేయాలని కోరడమైనది

1
0

4-7-2025

అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహం మరియు అమరావతిలో సీతారామరాజు శృతి వనం ఎర్పాటు చేయాలని కోరడమైనది

ధి:4-7-2025 శుక్రవారం ఉదయం 10:30″గం లకు ” సెంట్రల్ నియోజకవర్గంలోని రామకృష్ణాపురం బుడమేరు వంతెన వద్ద విజయవాడ క్షత్రియ యువజన సంఘం మరియు సేవా సంఘం వారి ఆధ్వర్యంలో మన్యం వీరుడు, స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు 128 వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించండం జరిగింది

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా:- ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు  బొండా ఉమామహేశ్వరరావు APIIC చైర్మన్ మంతెన రామరాజు ,  క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ v. సూర్యనారాయ రాజు ,బిల్డింగ్ అండ్ కన్ స్ట్రక్షన్స్  వర్కర్స్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ గొట్టు ముక్కల రఘు రామరాజు గారు , T . ఆంజనేయ రాజు (FKSS వైస్ చైర్మన్) , క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్స్ పాల్గొని ముందుగా అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్రంలోని ప్రతి వాడవాడలా అల్లూరి సీతారామరాజు జయంతి కార్యక్రమాలు ఘనంగా జరుగుతున్నాయని, రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యంను గడగడ లాడించిన దీరుడు అని, నేటి తరానికి అల్లూరి సీతారామరాజు పోరాట పటిమను , దేశభక్తిని చాటి చెప్పాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అల్లూరి సీతారామరాజును గౌరవిస్తూ భోగాపురం ఎయిర్పోర్టుకు ఆయన పేరు పెట్టడం, అమరావతిలో అల్లూరి స్మృతి వనానికి ఐదు ఎకరాలు స్థలం కేటాయింపు చేస్తామని చెప్పటం, పార్లమెంటులో సీతారామరాజు విగ్రహా ఏర్పాటుకు సన్నాహాలు చేయటం పట్ల క్షత్రియ యువజన సంఘం కృతజ్ఞతలు తెలుపుతుందన్నారు

ఈ కార్యక్రమంలో యువజన సంఘం అధ్యక్షులు T. మిదిలేష్ వర్మ , ప్రధాన కార్యదర్శి k . సీతారామరాజు , క్షత్రియ సేవా సంఘం  వైస్ ప్రెసిడెంట్ p. అప్పలరాజు, గొట్టుముక్కల వెంకటేశ్వర్లు (వెంకీ), ప్రధాన కార్యదర్శి u . విజయ్ రామరాజు,క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్లు, సభ్యులు క్షత్రియ పెద్దలు అల్లూరి సీతారామరాజు అభిమానులు అందరూ పాల్గొనడం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here